రానున్న రోజుల్లో టాలీవుడ్ సినిమా దగ్గర సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే మహేష్ బాబు బర్త్ డే కానుకగా అదిరే పోస్టర్స్ ని అందించగా..
ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అయ్యారు పైగా వీటితో సినిమాపై మరింత హైప్ అయితే పెరిగింది. కాగా ఈ సినిమా విషయంలో ఇవన్నీ పాజిటివ్ అంశాలు అయితే నెగిటివ్ గా ఉన్నవి కూడా ఉన్నాయి. సినిమా సబ్జెక్టు మారిపోవడం మొదట ఫిక్స్ అయిన హీరోయిన్ పూజా హెగ్డే అలాగే సినిమాకి కెమెరా మెన్ లాంటి వారు కూడా బయటకి వెళ్లిపోవడం వంటివి అలా ఏదోకటి షాక్ మీద షాక్ ని ఫ్యాన్స్ కి ఇస్తున్నాయి.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో రూమర్ సినిమాపై వినిపిస్తుంది. ఈ చిత్రం నుంచి మరో ఇద్దరు బయటకి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. కాగా వారే ఈ సినిమా ఫైట్ మాస్టర్ లు రామ్ లక్ష్మణ్ లు అట. ఈ ఇద్దరూ ఇప్పుడు గుంటూరు కారం నుంచి తప్పుకున్నరా లేక తప్పించారా అనేది ఆసక్తిగా మారగా తప్పించారు అనేదే ఇపుడు వినిపిస్తుంది.
మరి ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ చిత్రం విషయంలో ఏదొక సస్పెన్స్ ఇప్పుడు నడుస్తూనే ఉంది. లాస్ట్ ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు వస్తాయో చూడాలి. ఇంకా ఏఈ చిత్రంలో హీరోయిన్స్ గా శ్రీ లీల, మీనాక్షి చౌదరిలు నటిస్తుండగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.