‘ఆదిపురుష్’ కొంప ముంచుతున్న బిజినెస్ లెక్కలు.!

ఇదసలు తెలుగు సినిమాయేనా.? అన్న డౌట్ చాలామందికి వస్తోందంటే.. ‘ఆదిపురుష్’ ఎంతగా తెలుగు ఆడియన్స్‌కి దూరమైపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. రామాయణం నేపథ్యంలో సినిమా తెరకెక్కినా, అసలంటూ తెలుగు నేటివిటీ లేదు.. ఇండియన్ నేటివిటీ కూడా అసలే లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి.

నానా రకాల విమర్శల నడుమ, ‘ఆదిపురుష్’ ఎలాగోలా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ అంటున్నారు. ప్రభాస్ గత చిత్రాల వసూళ్ళతో పోల్చితే, ఇది చాలా చాలా పెద్ద లెక్క. చాలా రిస్కీ అటెంప్ట్. ‘ఇదసలు తెలుగు సినిమానే కాదు.. దీనికి అంత అనవసరం’ అనేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ బిగ్ నెంబర్స్ పట్ల ఆసక్తి చూపడంలేదట.

ప్రభాస్ సినిమాల విషయంలో ఇలాంటి దుస్థితి ఎదురవడం ఆశ్చర్యకరమే.