Team India Player: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టీమిండియా ప్లేయర్.. ఆ అమ్మాయి ఎవరంటే?

భారత క్రికెట్ టీమ్‌కి చెందిన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ సీజన్‌లో తన ప్రదర్శనతో అభిమానులను మెప్పించిన ఆయన, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్ననాటి స్నేహితురాలైన వంశికను వివాహం చేసుకోబోతున్నారన్న వార్త క్రికెట్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తోంది.

బుధవారం లక్నోలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో కుల్దీప్–వంశిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకను సన్నిహితుల మధ్య కానీ, భోగభాగ్యంగా నిర్వహించారు. ఇండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ సహా కొందరు ప్రత్యేక అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఎంతో సింపుల్‌గా, సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఈవెంట్‌లో వధూవరులు ధరించిన డ్రెస్సులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వంశిక గురించి విశేషాలు చూస్తే.. ఆమె లక్నోలోని శ్యామ్‌నగర్‌కు చెందిన యువతి. ప్రస్తుతం ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు కుల్దీప్‌తో చిన్ననాటి నుంచే మంచి స్నేహం ఉండేది. కాలక్రమంలో ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడంతో వీరి నిశ్చితార్థం విజయవంతంగా ముగిసింది. త్వరలోనే వివాహం జరగనున్నట్లు సమాచారం.

పవన్ ఖేల్ ఖతం || Analyst Ks Prasad Fires On Pawan Kalyan Over Tuni Train Case Verdict ||TeluguRajyam