“పుష్ప 2” ఫస్ట్ లుక్ వెనుక మరో స్టోరీ ఉందా.?

పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ హైప్ రేపిన రీసెంట్ చిత్రాల్లో అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. మరి బన్నీ సొంతంగా పాన్ ఇండియా వైడ్ గా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ని తన సినిమాలకి తెచ్చుకోగా ఇపుడు పుష్ప 2 పై వేరే లెవెల్ హైప్ ఉంది.

ఇక ఈ హైప్ ని అయితే చిత్ర యూనిట్ మొన్న బన్నీ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన టీజర్ అలాగే ఫస్ట్ లుక్ లకి గట్టి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి పుష్ప 2 ఫస్ట్ లుక్ విషయంలో అప్పుడు థియరీలు చాలా వైరల్ కాగా వాటిలో చిత్తూరు లో అయితే జరిగే గంగమ్మ జాతరకి మగవాళ్ళు అలాగే రెడీ అవుతారు అని ఒక వెర్షన్ వచ్చింది.

అయితే ఇపుడు సినిమాలో బన్నీ ని ఎందుకు అలా రెడీ చేసారో మరో క్రేజీ బజ్ తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఈ గెటప్ లో సిద్ధం చేసి ఓ భారీ ఏక్షన్ సీక్వెన్స్ అలాగే ఆ సీన్ ని ఓ పవర్ ఫుల్ సాంగ్ లో అయితే చూపించనున్నారు అని అందుకే అర్ధనారీశ్వరునిగా అల్లు అర్జున్ ని ఈ మాసివ్ సీక్వెన్స్ కోసం సిద్ధం చేసారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ఫస్ట్ లుక్ తో ఎక్కడ లేని ఊహించని హైప్ ఈ సినిమాకి వచ్చింది. ఇప్పుడు అనసూయ తదితర నటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మైత్రి మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.