Akhanda Movie: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సెన్సేషన్ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. మాస్ జాతరని తలపించే కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. కొన్ని వారాల పాటు థియేటర్స్‌ను కలకలలాడించి ఆడియన్స్‌తో రచ్చ రచ్చ చేసిన సినిమా అఖండ. కరోనా కాలం వెంటే ఉన్నా, ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గించినా అవేవీ అఖండ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. వాటన్నంటినీ దాటుకొని సక్సెస్ ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకున్న మూవీగా అఖండ నిలిచి మరో రికార్డ్‌ను బ్రేక్ చేసింది.
కరోనాతో పూర్వ వైభవం కోల్పోయిన థియేటర్లకు ఈ సినిమా ఊతమిచ్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అగ్ర హీరోలకు సైతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా మరియు క్రేజ్ పరంగా నమ్మకాన్ని పెరిగేలా చేశాయి. ఇకపోతే అఖండ సినిమా ఓటీటీలోనూ అత్యధిక వ్యూస్ సాధించి, ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో వంద రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు చాలా వచ్చేవి. మరి కొన్ని సినిమాలు 365 రోజుల వేడుకలు చేసుకున్న సినిమాలూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం కథ అంతా మారిపోయింది. ఈ మధ్య కాలంలో తీస్తున్న సినిమాలు వంద రోజులు పూర్తి చేసుకోవడం అంటే ఓ గొప్ప మైలు రాయిని చేరుకున్నట్టుగా భావించే పరిస్థితి ఏర్పడింది. కాగా ప్రస్తుతం అఖండ సినిమా కూడా గ్రాండ్ సక్సెస్‌ను అందుకోవడంతో సక్సెల్‌ఫుల్‌గా ఆ సినిమా 100 రోజుల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతగా ఆదరించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ నెల 12వ తేదీన కర్నూల్ ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో ‘కృతజ్ఞత సభ’ను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలాకాలం తరువాత జరుగుతున్న 100 డేస్ ఫంక్షన్ అనే చెప్పుకోవాలి.