బిగ్ న్యూస్ : చిరుకి మరో అరుదైన గౌరవం.?

1119010-chiru (1)

తెలుగు సినిమా దగ్గర ఇప్పుడు ఉన్న దిగ్గజ హీరో తెలుగు సినిమాకి సమస్య ఉంటే అన్ని తానై ముందుండి చూసుకొని నడిపించే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కాసేపు తన సినిమాల విషయం పక్కన పెడితే చిరంజీవి వ్యక్తిగతంగా కూడా ఎన్నో సేవలు అందించారు. వాటిలో కూడా పలు అవమానాలు ఎదుర్కొన్నారు కానీ చివరికి తాను నమ్ముకున్న సత్యం తోనే గెలిచి చూపించారు.

కాగా ఇప్పటికే తెలుగు సినిమా ప్రైడ్ గా తనకి ఎన్నో పురస్కారాలు రాగా అందులో ప్రముఖ పురస్కారం పద్మభూషణ్ కూడా ఒకటి. ఇక ఇప్పుడు తనకి కేంద్రం మరింత గౌరవాన్ని అందిస్తున్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో కేంద్రం చిరంజీవికి పద్మ విభూషణ్ ని అందించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి విభూషణ్ జాబితాలో అనేక మంది పేర్లతో పాటుగా చిరంజీవి కూడా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పటివరకు చిరంజీవి చేసిన ఎన్నో సేవల విషయంలో అయితే తనకి ఈ అరుదైన గౌరవాన్ని కేంద్రం అందించనుంది అని సమాచారం. కాగా దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుంది అని సినీ వర్గాల్లో వార్తలు విరివిగా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా సెన్సేషనల్ ప్రాజెక్ట్ “విశ్వంభర” ని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వసిష్ఠ ఒక భారీ విజువల్ వండర్ లా ప్లాన్ చేస్తున్నాడు.