IPL 2025: RCBలోకి మరో పవర్ఫుల్ ప్లేయర్.. ఎంతకు కొన్నారంటే..

ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశకు చేరుకుంటున్న వేళ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కీలక మార్పు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జాకబ్ బెతెల్ తన జాతీయ జట్టు బాధ్యతలతో ప్లేఆఫ్స్‌కు దూరమవుతున్న నేపథ్యంలో, అతని స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సీఫెర్ట్‌ను తీసుకుంది. దీనితో జట్టులో కొత్త శక్తిని నింపాలని ఆర్సీబీ భావిస్తోంది.

టిమ్ సీఫెర్ట్‌కి 2 కోట్ల రూపాయల చెల్లింపుతో ఒప్పందం కుదిరింది. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ఈ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్, ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో తన ఫామ్‌ను రుజువు చేసుకున్నాడు. మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం ఉండవచ్చని సమాచారం.

ఆర్సీబీ ఇప్పటికే వరుస విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ సమయంలో సీఫెర్ట్ లాంటి ఆటగాడి చేరిక జట్టుకు మంచి బలాన్నిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్లు స్ఫూర్తిగా, యువ ఆటగాళ్లకు మంచి బ్యాలెన్స్ ఉండేలా RCB స్క్వాడ్‌ను మేనేజ్‌మెంట్ డిజైన్ చేస్తోంది.

ప్రస్తుతం అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. టిమ్ సీఫెర్ట్ చేరికతో ప్లేయింగ్ XI లో ఎవరెవరు ఉంటారు? ఫినిషింగ్, స్టాటజీ ఏవిధంగా ఉంటుంది? అన్న ఉత్కంఠ మొదలైంది. మొత్తంగా, ఈ కొత్త చేరికతో ఆర్సీబీ మరింత స్ట్రాంగ్ అవుతుందా లేదా అన్నది రాబోయే మ్యాచ్‌లలో తేలనుంది.