Koratala Shiva: టాలీవుడ్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ… కొరటాల దర్శకత్వంలోననే టాక్..?

Koratala Shiva: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోన్న నేపథ్యంలో మల్టీ స్టారర్ సినిమాలకు క్రేజ్ పెరిగిపోయింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి సినిమాలు తీసినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ ఆ కాంబో వెలుగులోకి వచ్చిందని టాక్. ఇక రామ్‌ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైనట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇకపోతే ద‌క్షిణాది సినిమాలు ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గర మ్యాజిక్ చేయ‌డం ప్రారంభించాయో అప్పుడే మ‌న డైరెక్టర్స్ డిఫ‌రెంట్ స్టోరీ ఐడియాస్‌తో కొత్త కొత్త సినిమాలు చేయ‌డం ప్రారంభించారు. అలా మ‌న తెలుగు నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డుల దుమ్ము దులుపుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తాను చాటుతున్నాయి. ఇప్పుడు మ‌రో స్టార్ డైరెక్టర్ ఇలాంటి మ‌రో డెడ్లీ కాంబినేష‌న్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌.

ఇంత‌కీ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న ద‌ర్శకుడు ఎవ‌రో తెలుసా! కొర‌టాల శివ‌. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెప్పడంలో కొర‌టాల శివ‌కు ఓ ప్రత్యేక‌మైన స్టైల్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయ‌న ద‌ర్శక‌త్వంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆచార్య సినిమా తెర‌కెక్కగా, ఎన్నో వాయిదాల తర్వాత మళ్లీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు కొర‌టాల శివ .. పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప ది రైజ్ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్‌, ఇప్పటికే ఇటు ద‌క్షిణాదితో పాటు అటు ఉత్తరాది ప్రేక్షకుల‌కు సుప‌రిచితుడైన ధ‌నుష్ కాంబినేష‌న్‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక ప్రస్తుతం కొర‌టాల శివ త‌న నెక్స్ట్ చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై సినిమా రూపొంద‌నున్న ఈ చిత్రంలో ఆలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని తెలుస్తోంది. కాగా జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై ఇప్పటి నుంచే భారీ అంచ‌నాలున్నట్టు సినీ వర్గాల సమాచారం.