పాపం..టాలీవుడ్ లో మరో ఐరన్ లెగ్ హీరోయిన్..!

టాలీవుడ్ సినిమా దగ్గర పరిచయం అయ్యి భారీ స్టార్డం అందుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కేవలం ఒక్క సినిమా తోనే మంచి క్రేజ్ ని కొందరు తెచ్చుకోగా మరికొందరు అయితే ప్లాప్ హీరోయిన్స్ గానే మిగిలిపోతారు. ఇక అలా టాలీవుడ్ లో లేటెస్ట్ గా కొందరు హీరోయిన్స్  సినిమాలతోనే పెద్ద ఎత్తున షైనింగ్ అవుతుండగా కొందరు మాత్రం ఐరన్ లెగ్ అనే ట్యాగ్ దగ్గర ఉన్నారు.

రీసెంట్ గా పూజా హెగ్డే పై ఈ ముద్ర పడడంతో ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలు నుంచి కూడా ఆమెని తప్పించేస్తున్నారు. ఇక ఇపుడు మరో యంగ్ హీరోయిన్ కోసం టాలీవుడ్ మాట్లాడుతుంది. ఆమెనే సాక్షి వైద్య. అఖిల్ అక్కినేని చిత్రం “ఏజెంట్” తో టాలీవుడ్ కి పరిచయం అయ్యిన ఈమె భారీ డిజాస్టర్ ని మొదటి సినిమాతో అందుకుంది.

ఇక రీసెంట్ గా వచ్చిన రెండో సినిమా మెగా హీరో వరుణ్ తేజ్ తో చేసిన చిత్రం “గాండీవధారి అర్జున” కూడా ఏజెంట్ ని మించిన ప్లాప్ అయ్యింది. దీనితో మళ్ళీ హీరోయిన్ పేరు తోనే ప్రస్తావన మొదలైంది. కారణాలు ఏవైనా కూడా మన టాలీవుడ్ లో సెంటిమెంట్ లు ఎక్కువ. మరి దానిని మించి అయితే ఈ హీరోయిన్ భారీ సక్సెస్ కొట్టి చూపించి అందరి నోర్లు మూయిస్తుందో లేక ఫేడ్ అవుట్ అవుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ఇప్పుడు అయితే టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ ఈమె చేతిలో ఉన్నాయి.