‘సింహాద్రి’కి ఎందుకీ తలనొప్పి.?

గుర్తుందా.? చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘సింహాద్రి’ సినిమాని ఇండస్ట్రీ హిట్.. అనిపించేందుకోసం.. నానా తంటాలూ పడ్డారు. అవే పాట్లు ఇప్పుడు రీ-రిలీజ్ విషయంలోనూ పడక తప్పడంలేదు.

అభిమానులేమో, ‘సింహాద్రి’ 4కె వెర్షన్ విషయమై చాలా చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టమంతా వృధా అవుతోందిట. ఆశించిన స్థాయిలో స్పందన లేదని యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులే ఆఫ్ ది రికార్డుగా వాపోతున్నారు.

ఎన్టీయార్ పుట్టినరోజు దగ్గరకి వచ్చేసింది. ఈ తరుణంలో ‘సింహాద్రి’ చుట్టూ జరుగుతున్న ‘చప్పటి ప్రచారం’ అస్సలేమాత్రం మింగుడు పడ్డంలేదు ఎన్టీయార్ సన్నిహితులకి.

బాలయ్య అభిమానులు స్ట్రిక్ట్ వార్నింగ్‌తో నందమూరి అభిమానుల్లో కొందరు ‘సింహాద్రి’కి దూరంగా వుంటున్నారట. అవసరమా ఈ తలనొప్పి.?