లేటెస్ట్ : ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ లో మరో క్రియేషన్ రివీల్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇపుడు చేస్తున్న పలు మాసివ్ సబ్జెక్టు లలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మాసివ్ బడ్జెట్ సినిమా “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. కాగా ఈ భారీ ప్రాజెక్ట్ అయితే ఓ యూనిక్ పాయింట్ తో తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమా వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ గా అయితే అనౌన్స్ అయ్యింది.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అయితే దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలో అయితే ఓ సూపర్ హీరో సహా పురాణాలు కాన్సెప్ట్ లో వస్తుండగా లేటెస్ట్ గా చిత్ర యూనిట్ అయితే ఓ ఇంటెస్టింగ్ వీడియో ని ఇప్పుడు రిలీజ్ చేశారు.

మొదటగా అయితే సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది అస్సలు తాము ఎక్కడ నుంచి స్టార్ట్ చేసాం అంటూ ఓ చక్రాన్ని క్రియేట్ చేసిన వీడియోతో స్టార్ట్ చేయగా ఇప్పుడు సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ని రివీల్ చేశారు. ఈ సారి సినిమాలో విలన్ సైన్యం తాలూకా రైడర్స్ డ్రెస్ కోడ్ ని ఎలా డిజైన్ చేసారో తెలిపారు.

ఇవన్నీ చూస్తుంటే ఏదో హాలీవుడ్ లెవెల్లో మనకి అనిపిస్తుంది. దీనితో ఈ వీడియో ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ సినిమాకి అయితే సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ ఏకంగా 700 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారని భోగట్టా..