బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైన సంగతి తెలిసిందే. దీంతో బాహుబలి రేంజ్‌లో సినిమాను తెరకెక్కించడానికి బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ దర్శకులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఏదీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈ మధ్యలోనే కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో పొన్నియన్ సెల్వన్ రిలీజై ఆడియెన్స్‌ను ఆక్టటుకుంది. కానీ అది బాహుబలి స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. అయితే పొన్నియల్ సెల్వన్ కన్నా ముందే 2017లో బాహుబలి రేంజ్‌లో దానికి పోటీగా తమిళంలో ఓ సినిమాను ప్రకటించారు. అదే ‘సంఘమిత్ర’.
తమిళంలో కళావతి, చంద్రకళ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఏకంగా కేన్స్ ఇంట్రనేషనల్ ఫెస్టివల్లో ప్రకటించారు. దీంతో అది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో జయం రవి, శ్రుతిహాసన్, ఆర్య వంటి స్టార్లు నటించేందుకు సిద్ధమయ్యారు. శ్రుతిహాసన్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. గుర్రంపై కత్తి పట్టుకుని యద్ధం చేస్తున్నట్లు కనిపించింది. దీని కోసం ఆమె బాగా శ్రమించింది కూడా. రోజు ఎంతో శిక్షణ కూడా తీసుకుంది. కానీ ఆ తర్వాత శ్రుతిహాసన్ వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక ఆ తర్వాత చిత్రం కూడా కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆదిలోనే ఆగిపోయింది.
అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌ను మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని తమిళ సినీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో కొన్ని మార్పులు జరిగాయి. తాజా సమాచారాం ప్రకారం అప్పుడు రూ.150కోట్లతో నిర్మించాలనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఏకంగా రూ.450కోట్లతో రూపొందించబోతున్నారట. ఇందులో జయం రవి స్థానంలో విశాల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి శ్రుతితో పాటు ఇతర తారాగాణం నటిస్తందో లేదో చూడాలి.
ఈ ఏడాది అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని సుందర్ సి యోచిస్తున్నారట. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తున్నారట. అందరితో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే దీని మళ్లీ అధికారికంగా ప్రకటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో కూడా చెప్పారు. “సంఘమిత్ర రెండు భాగాలుగా రాబోతుంది. మొదట క్లైమాక్స్ సన్నివేశాలను సముద్రంలో తెరకెక్కిస్తారు. ఇండియాలో భారీ సినిమాగా రూపొందుతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ ఏడాది మధ్యలో తెలియజేస్తారు” అని తమిళ సినీవర్గాలు తెలిపాయి.