రజనీకాంత్.. సూపర్ స్టార్ గా కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. రజనీకాంత్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద సందడి ఒక సునామీలా ఉంటుంది. అంతేకాదు ఆ రోజు చెన్నై లో స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ కి సెలవు ప్రకటిస్తారు. థియేటర్స్ దగ్గర రజనీకాంత్ కటౌట్స్ .. హోర్డింగ్స్ పెట్టి పాలాభిషేకాలు చేస్తారు. ఇదే కాదు చాయ్ అమ్ముకునే వాళ్ళ దగ్గర్నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మాన్స్ వరకు రజనీకాంత్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ రజనీకాంత్ కి అభిమాన సంఘాలు ఉన్నాయి.
కాగా గతంలో బాబా సినిమా చేసినప్పుడు ఇదే నా చివరై సినిమా అని ప్రకటించి రజనీ కాంత్ మళ్ళీ అభిమానుల కోసం మనసు మార్చుకొని వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. డెబ్బై ఏళ్ల వయసులోనూ కేవలం తన ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తున్నారంటే ఆయనకి అతని అభిమానుల పట్ల తిరిగి ఎంత అభిమానం చూపిస్తున్నారో తెలుస్తోంది. అయితే ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన రజనీకాంత్ మళ్ళీ డ్రాపయ్యారు.
ఇక ఇప్పటి నుంచి తన కెరీర్ మొత్తం సినిమాలకోసమే అన్నట్టు మాట్లాడారు. కాగా ఇటీవలే ‘అన్నాతే’ షూట్ కోసం హైదరాబాద్ వచ్చిన రజని.. అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం నిలకడగా ఉండటం తో చెన్నై వెళ్లిపోయారు. కాగా రాజకీయాలలోకి రావట్లేదంటూ ప్రకటించిన రజనీకాంత్.. ఇప్పుడు సినిమాల విషయంలోనూ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం తన కుటుంబ సభ్యులని చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ వయసు దృష్ఠ్యా సినిమాలు మానేసి కంప్లీట్ గా రెస్ట్ తీసుకోమని కుటుంబ సభ్యులు పట్టుపడుతున్నారట. దాంతో రజనీకాంత్ త్వరలో సినిమాలకి గుడ్ బాయ్ చెప్పారా అన్న టాక్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోందట. ఈ విషయం తెలిసి రజనీకాంత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారట. అయితే ఇంకా రజనీ కాంత్ మాత్రం సినిమాలు మానేస్తున్నట్టు అధికారకంగా వెల్లడించలేదు.ఇక రజనీకాంత్ సరసన కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్భార్ తర్వాత రజనీకాంత్ నుంచి వస్తున్న అన్నాతే మీద భారీ అంచనాలు ఉన్నాయి.