రిలీజ్ కి అన్ని మంచి శకునములే..

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జోడీగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అన్ని మంచిశకునములే. స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ మూవీని నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరపై నందిని రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇక సంతోష్ శోభన్ ఈజ్ యాక్టింగ్ కి పెర్ఫెక్ట్ మూవీ దొరికిందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

ఓ విధంగా చెప్పాలంటే మూవీపై మంచి పాజిటివ్ బజ్ ఉంది. అలాగే కుర్ర హీరోలు అందరూ కూడా వచ్చి మూవీని భాగా ప్రమోట్ చేస్తున్నారు. నాని, అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ ఈవెంట్స్, ఇంటర్వ్యూల ద్వారా చిత్రానికి కావాల్సినంత బూస్టింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బయట టెంపరేచర్ 45 డిగ్రీలు తాకుతోంది. బయటకి వెళ్ళాలంటేనే జనం హడలిపోతున్నారు.

ఈ పరిస్థితిలో థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటం అంటే కాస్తా కష్టమైన విషయమే అని చెప్పాలి. అయితే మూవీ బాగుంది అనే టాక్ వస్తే మాత్రం సినీ అభిమానులు ఇవేమీ లెక్క చేయకుండా థియేటర్స్ కి వెళ్తారు. ఇక అన్ని మంచి శకునములే మూవీకి పోటీగా బిచ్చాగాడు 2తో పాటు హాలీవుడ్ మూవీ ఫాస్ట్ ఎక్స్ వస్తోంది. ఫాస్ట్ ఎక్స్ సిరీస్ లో గత చిత్రాలకి మంచి రెస్పాన్స్ ఉంది.

ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే బిచ్చగాడు2పై పెద్దగా బజ్ లేదు. అలాగే సింగిల్ స్క్రీన్స్ లో హాలీవుడ్ మూవీకి పెద్దగా ఆదరణ ఉండదు. ఈ నేపథ్యంలో అన్ని మంచి శకునములే మూవీకి కావాల్సినంత స్పేస్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వీకెండ్స్ లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండొచ్చు.

నందిని రెడ్డి డైరెక్షన్, స్వప్న సినిమా ప్రొడక్షన్ వేల్యూస్ తో మూవీకి కొంత వరకు హైప్ ఉంది. మరి ఈ హైప్ సినిమాని ఏ మేరకు ఆడియన్స్ లోకి తీసుకెళ్తుంది. అలాగే సమ్మర్ హీట్ ని లెక్కచేయకుండా ప్రేక్షకులని థియేటర్స్ లోకి ఏ మేరకు రప్పిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.