Ram Charan : రామ్ చరణ్ సరసన సీతమ్మ… జోడి కుదిరేనా…!

Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా శంకర్ డైరెక్షన్ లోని సినిమా. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా అప్ డేట్స్ రోజు ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇక తాజా గా ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక మరో హీరోయిన్ కి ఈ సినిమాలో ఛాన్స్ ఉందట.ఇక ఆ పాత్రకోసం సీతమ్మని అదేనండి మన అంజలిని తీసుకుంటున్నట్టు సమాచారం.

అంజలి నటనలో ఎలాంటి డోకా లేదు కానీ రామ్ చరణ్ కు జోడిగా ఎలా వుంటుందో అనే సందేహాలు వినపడుతున్నాయి.ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు అని సమాచారం.దిల్ రాజు చాలా ఏళ్ల తర్వాత చరణ్ తో సినిమా తీస్తున్నారు. ఎవడు తర్వాత మల్లి వీళ్లిదరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.

సీనియర్ రామ్ చరణ్ సరసన అంజలి నటిస్తుండగా, జూనియర్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే ఆ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్, దుబాయ్ లో జరగనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.