ముద్దులు కురిపిస్తున్న ముద్దుగుమ్మ‌.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

సెలెబ్రిటీల్లో ఎవరు, ఎప్పుడు, ఎలాంటి షాక్ లు.. సర్ ప్రైజ్ లు ఇస్తుంటారో ఎవ్వరూ ఊహించలేరు. వారి ఫేవరెట్ స్టార్స్ విషయంలో ఏవైనా మార్పులు వచ్చాయంటే చాలు సోషల్ మీడియా అద్దిరిపోయేలా వైరలవుతుంటాయి. ఇప్పుడు హీరోయిన్ అంజలి విషయంలో కూడా అదే జరిగింది. రీసెంట్ గా నిశ్శబ్ధం సినిమాలో తన శైలి ఫర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన అంజలి.. ఇప్పుడు సన్నగా.. నాజూకుగా తయారయింది. ఒకప్పుడు చబ్బీగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు సన్నజాజి తీగ లా మారింది. దీంతో తన అభిమానులు సైతం సర్ ఫ్రైజ్ అవుతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హోమ్లీగా ఆకట్టుకున్న అంజలి ఇప్పుడు హీట్ పుట్టించే హాట్ ఫోటోస్ తో యూత్ మతులు చిత్తు చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అంజలి ఫోటోలే దర్శనమిస్తూన్నాయంటే.. తన లేటెస్ట్ ఫోటో షూట్స్ యూత్ ని ఎంతగా మెస్మరైజ్ చేశాయో తెలుస్తుంది.

క్రేజీ స్టిల్స్ తో.. అద్దిరిపోయే పోజులతో ఉన్న అంజలి ఫోటోలు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారాయి. దీంతో పాటు అంజలి తన సోషల్ మీడియా అకౌంట్ లో రకరకాల స్టిల్స్ ఇస్తూ.. ఫోటోలు అప్ లోడ్ చేసింది. ఇందులో ముఖ్యంగా తన ఫేవరెట్ పెట్ కు ముద్దులు పెడుతూ.. ఆడుతున్న ఫోటోలు ప్రతిఒక్కర్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో అంజలి లేటెస్ట్ ఫోటోలతో పాటు సన్నగా మారినప్పటి నుండి తీయించుకున్న ఫోటోస్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

అయితే సినీ ఇండస్ట్రీకి తెలుగమ్మాయిగా పరిచయమైన అంజలి.. అటు కోలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంది. రీసెంట్ గా పలు ప్రేమ వ్యవహారాల్లో అంజలి పేరు మార్మోగిపోయింది. దీంతో పాటు అంజలికి సినిమా అవకాశాలు తగ్గడంతో తనను తాను ఇలా మార్చుకుంటూ.. తన అభిమానులతో పాటు దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించడానికి.. ఆమెకు సినిమా అవకాశాలు పెంచుకోవడానికే ఈ ప్రయత్నాలు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.