ఇండస్ట్రీ టాక్ : టాలీవుడ్ కి షాకిస్తున్న అనిరుద్?

ఇప్పుడు ఒక్క సౌత్ ఇండియా సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు ఎవరన్న ఉన్నారు అంటే బక్క పలుచని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా ఒకడు అని చెప్పాలి. మరి అనిరుద్ ఇప్పుడు పలు భారీ చిత్రాలు తమిళ్, తెలుగు సహా బాలీవుడ్ లో కూడా చేస్తున్నాడు.

ఇక మోస్ట్ బిజీగా ఉన్న సంగీత దర్శకుడుగా తాను నిలవగా ఇప్పుడు అయితే అనిరుద్ విషయంలో ఓ షాకింగ్ రూమర్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికి అనిరుద్ తెలుగులో నాలుగైదు చిత్రాలు చేసాడు అలాగే రానున్న రోజుల్లో మరిన్ని చేస్తున్నాడు.

అయితే తాను ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో ఉన్న సమయంలో టాలీవుడ్ చిత్రాలకి నిర్మాతలకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. తానై భారీ మొత్తంలో ఇస్తామని తెలుగు నిర్మాతలు చెప్తున్నా కూడా తాను తనకి ఉన్న సమయంలోనే సినిమాలు చేస్తానని అలా అయితేనే చేస్తాను లేదా మీ ఇష్టం అని తేల్చి చెప్పేస్తున్నాడట.

దీనితో అనిరుద్ విషయంలో ఈ న్యూస్ షాకింగ్ గా మారింది. ఇప్పుడు అయితే అనిరుద్ కి 10 కోట్లు వరకు కూడా ఇచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అనిరుద్ ససేమిరా అంటున్నాడని మరో రూమర్ ఉంది. మరి వీటిలో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయో చూడాలి. ఇప్పుడు అయితే తాను కంపోజ్ చేసిన “జైలర్” చిత్రం భారీ సక్సెస్ అందుకోగా తెలుగులో తాను జూనియర్ ఎన్టీఆర్ తో “దేవర” చిత్రాన్ని చేస్తున్నాడు.