మహేష్ – వంగ ప్రాజెక్ట్ పై అసలు నిజం చెప్పిన నిర్మాత..!

ఇప్పుడు బాలీవుడ్ సహా టాలీవుడ్ ఆడియెన్స్ కూడా మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “ఆనిమల్”. బాలీవుడ్ వెర్సటైల్ హీరో రణబీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా భారీ హైప్ ని నెలకొల్పుకుంది.

అలా అక్కడ నుంచి కేజ్రీగా మారిన ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో ఈ సినిమా విషయంలో దర్శకుడు సందీప్ కి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నల్లో సమాధానంగా తాను సూపర్ స్టార్ మహేష్ బాబు కి రెడీ చేసింది “డెవిల్” అనే మరో కథ. “ఆనిమల్” రణబీర్ కోసం చేసిందే అని తెలిపాడు.

అయితే అక్కడ నుంచి అసలు మహేష్ సందీప్ ల సినిమా ఎందుకు పట్టాలెక్కలేదు అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న దీనితో ఈ ప్రశ్నకి సందీప్ సోదరుడు ఆనిమల్ నిర్మాత అయినటువంటి ప్రణయ్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చాడు. మహేష్ సందీప్ ల సినిమాపై వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని..

అది డేట్స్ అడ్జట్ కాక సెట్స్ మీదకు వెళ్ళలేదు తప్ప మహేష్ స్క్రిప్ట్ లో మార్పులు చేయమని లాంటివి ఏవి చెప్పలేదు. నిజానికి మహేష్ కి ఆ లైన్ చాలా నచ్చింది అని ప్రణయ్ తెలిపాడు. దీనితో ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై అసలు క్లారిటీ ఇదన్నమాట.. సో మహేష్ మార్పులు చేర్పులు అంటూ వచ్చిన కామెంట్స్ లో ఎలాంటి నిజం లేదు.