ఓవర్సీస్ లో ఫస్ట్ ఎవర్ రికార్డ్ తో “ఆనిమల్” వేట మొదలు..!

లేటెస్ట్ గా బాలీవుడ్ మార్కెట్ నుంచి భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన చిత్రం “ఆనిమల్”. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి టీకెక్కించిన వంగ తెరకెక్కించిన ఈ హై ఎమోషనల్ అండ్ ఆక్షన్ డ్రామా ఈరోజు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయ్యింది.

అయితే ఈ చిత్రం ఒక్క బాలీవుడ్ సహా తెలుగులోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ రిలీజ్ అయ్యింది. కాగా మెయిన్ గా యూఎస్ వెర్షన్ లో అయితే ఈ చిత్రం ఆల్ టైం హైయెస్ట్ నెంబర్ స్క్రీన్స్ లో విడుదల కాగా ఈ చిత్రం ఊహించని విధంగా రికార్డు వసూళ్లు అక్కడ నమోదు చేస్తున్నట్టుగా చెప్తున్నారు.

కాగా ఈ సినిమా యూఎస్ లో జస్ట్ ప్రీమియర్ వసూళ్లతోనే బాలీవుడ్ లో ఏ సినిమా కూడా అందుకోని భారీ ఓపెనింగ్స్ అందుకోగా ఈ వసూళ్లు ఇప్పుడు 1 మిలియన్ డాలర్ మైల్ స్టోన్ ని కూడా దాటేసింది. దీనితో “ఆనిమల్” జస్ట్ ప్రీమియర్స్ తోనే ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ డాలర్ వసూళ్లు కలిగిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.

దీనితో మేకర్స్ ఇలా ఆనిమల్ హంట్ స్టార్ట్ అయినట్టుగా అంటున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని భారీ వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా అనీల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.