తెలుగు సినిమాలకి థ్రెట్ గా మారిన “ఆనిమల్”??

ఈ ఏడాదికి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఎండింగ్ గా అయితే ఈ డిసెంబర్ నిలవబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ డిసెంబర్ 1 నుంచే పలు భారీ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రాబోతుండగా ఆ చిత్రాల్లో “ఆనిమల్” కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అలాగే హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ ఏక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాపై నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది.

ఇంకా ఆసక్తికరంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మాస్ బుకింగ్స్ నమోదు అవుతుండడం విశేషం. అయితే ఈ క్రమంలో ఆనిమల్ సినిమా మూలాన మన తెలుగు సినిమాలకి అది కూడా మిడ్ రేంజ్ హీరోస్ నాని మరియు నితిన్ సినిమాలకి దెబ్బ పడిందా అంటే అదేమో కానీ ఈ వారంలో ఆనిమల్ తో వస్తున్నా సినిమాలకి మాత్రం దెబ్బ పడింది అని చెప్పవచ్చు.

సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర ఇంకా చిన్న సినిమాలు ఉండగా వాటిని ఎవరూ పట్టించుకోవడంలేదు. కానీ ఇక్కడ నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ లని కూడా పట్టించుకోవడం లేదని కొందరు అంటున్నారు. అయితే ఈ సిన్మాలు నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుండగా అప్పుడికి ఆనిమల్ కి హిట్ టాక్ లో ఉంటే మాత్రం వాటికి థ్రెట్ ఉంటుంది అని చెప్పవచ్చు. అసలే సందీప్ వంగ సినిమాల క్రేజ్ వేరు మరి ఆనిమల్ రిజల్ట్ పాజిటివ్ వస్తే నాని నితిన్ సినిమాలకి కొంచెం ఎఫెక్ట్ పడవచ్చు..