సెన్సేషనల్ “ఆనిమల్” 6వ రోజు కూడా రికార్డు వసూళ్లు..!

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో దంచి కొడుతున్న సెన్సేషనల్ హిట్ చిత్రం “ఆనిమల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించగా బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా మరియు త్రిప్తి దిమిరి లు హీరోయిన్స్ గా నటించారు.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ నుంచే సంచలన రికార్డ్స్ చేస్తూ వస్తుంది. అయితే మెయిన్ గా వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత ఆనిమల్ సినిమా కనబరుస్తున్న పెర్ఫామెన్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉండనని చెప్పాలి. కాగా ఈ చిత్రం వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత హిందీ మార్కెట్ నుంచి ప్రతి రోజు కూడా ఆల్ టైం రికార్డు గ్రాస్ ని రాబడుతూ ఉండడం విశేషంగా మారింది.

దీనితో ఇలా ఆరవ రోజు కూడా ఆనిమల్ హిందీలో రికార్డు మొత్తంలో 27.8 కోట్ల గ్రాస్ కి పైగా రాబట్టి రికార్డు సెట్ చేసింది. అయితే ఇప్పుడు మొత్తం 6 రోజుల్లో ఈ చిత్రం రికార్డు మార్క్ 500 కోట్ల గ్రాస్ ని దాటేసి ఏకంగా 527.6 కోట్ల గ్రాస్ ని అందుకొని ఓ హిస్టారికల్ రన్ ని అయితే కంటిన్యూ చేస్తుంది అని చెప్పాలి.

మరి ఈ చిత్రం డెఫినెట్ గా ఇదే ఊపులో మళ్ళీ ఈ వీకెండ్ లో భారీ నంబర్స్ సెట్ చేస్తుంది అని చెప్పొచ్చు. మరి ఈ వీక్ ఆనిమల్ హవా ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ చిత్రంలో బాబీ డియోల్ అనీల్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని దర్శకత్వంతో పాటుగా ఎడిటింగ్ నిర్మాణం కూడా వహించాడు.