బాక్సాఫీస్ : మొదటి వారం “ఆనిమల్” వరల్డ్ వైడ్ కలెక్షన్స్..!

ఈ ఏడాది ఎండింగ్ కి చివరి నేలగ డిసెంబర్ స్టార్ట్ కావడంతో ఈ నెల మొదటి తేదీ లోనే వచ్చిన మోస్ట్ అవైటెడ్ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు సెట్ చేస్తుంది. కాగా ఆ చిత్రమే “ఆనిమల్” అయితే దీనిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించగా రష్మికా మందన్న హీరోయిన్ గా నటించింది. మరి ఈ సెన్సేషనల్ కలయికలో వచ్చిన ఈ చిత్రం దాదాపు మూడున్నర గంటలకి పైగా బ్రేక్ తో కలిపి ఉన్నప్పటిజీ షాకింగ్ వసూళ్లు నమోదు చేస్తూ రావడం ఓ రేంజ్ లో మారింది.

దీనితో ఈ చిత్రం డే 1 నుంచే వేట మొదలు పెట్టగా వీక్ డేస్ లోకి వచ్చాక కూడా బాలీవుడ్ దగ్గర ఆల్ టైం రికార్డ్స్ అందుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మొదటి వారం రోజుల రన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. మరి ఈ వారం రోజుల్లో అయితే వరల్డ్ వైడ్ గా 536.3 కోట్ల వసూళ్లు అందుకుంది.

అయితే ఇక అసలు ఆట ఇప్పుడు ఉంది. ఈ శనివారం ఆదివారం వసూళ్లు ఈ సినిమాకి మరింత లెవెల్లో పెరగనున్నాయి అని చెప్పొచ్చు. దీనితో ఈ వీకెండ్ మరింత భారీ వసూళ్లు ఈ చిత్రం కొల్లగొడుతుంది. ఎలా లేదన్నా ఈ సినిమా 650 కోట్ల గ్రాస్ కి ఈ రెండు రోజుల్లో చేరిపోవచ్చు. మరి చూడాలి ఈ రెండు రోజులు ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయి అనేది.