ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా అంటున్న “ఆనిమల్” ఫేమ్ త్రిప్తి 

ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఓ హీరోయిన్ కి ఒక్క సినిమా ఇచ్చే బ్రేక్ ఒక్కసారిగా తమ లైఫ్ ని మార్చేస్తుంది. అలా ఓ సినిమాలో రెండో హీరోయిన్ లేదా సైడ్ హీరోయిన్ గా చేసిన వాళ్ళకి కూడా మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమ్ వస్తుంది. మరి సరిగ్గా అలానే రీసెంట్ భారీ హిట్ “ఆనిమల్” సినిమా సంచలనం త్రిప్తి దిమిరి ఈ ఒక్క సినిమాతో భారీ ఫేమ్ ని తెచ్చుకుంది.

తన ఇన్స్టాగ్రామ్ లో అయితే సినిమాకి ముందు 6 లక్షల ఫాలోవర్స్ నుంచి 45 లక్షల మేర ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అయితే ఈమె రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని షేర్ చేసుకుంది. కాగా ఆమె మాట్లాడుతూ ఆనిమల్ రిలీజ్ తర్వాత చాలా నిద్ర లేని రాత్రిళ్లు గడపాల్సి వచ్చింది అని.

అది ఎందుకు అంటే ఈ సినిమా హిట్ అయ్యిన తర్వాత తనకి సోషల్ మీడియాలో సినిమా నుంచి అనేక మంది మెసేజ్ లు కాల్స్ నాన్ స్టాప్ గా రాత్రి పగలు వచ్చేవి అని అందుకే తనకి ఈ ఇన్ని రోజులు కూడా అసలు నిద్ర అనేదే సరిగ్గా లేదని ఆమె చెప్పుకొచ్చింది.

మొత్తానికి అయితే ఆనిమల్ తో భారీ ఫేమ్ ని అందుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి కూడా ఎన్నో ఆఫర్స్ ని అందుకుంటుంది. దీనితో రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాల్లో ఆమె కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఆనిమల్ సినిమాని తెలుగు దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించగా రణబీర్ కపూర్ హీరోగా నటించాడు.