Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్స్ గా పేరు సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా తన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి తదుపరి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.
అనిల్ రావిపూడి ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో ఈయన ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించారు ఈ ఎనిమిది సినిమాలు కూడా సూపర్ హిట్ కావటం విశేషం. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరొక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈయన ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి ముందు ఉంచారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ.. తన సినిమాలను గోదావరి జిల్లాలకు చెందిన అభిమానులు ఎంతగానో ఆదరిస్తారని తెలియజేశారు. గోదావరి అంటేనే మర్యాదలకు మారుపేరు అని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ తరుణంలోనే మర్యాదలకు మారుపేరు అయినటువంటి ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు చేయబోతున్నారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనిల్ సమాధానం చెబుతూ తాను కూడా ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని తెలిపారు. మరి అనిల్ రావిపూడికి ప్రభాస్ ఆ అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.