బుల్లితెరపై తనదైన శైలిలో యాంకర్ విష్ణు ప్రియ ఆకట్టుకుంటోంది. ఆమె ముక్కు, గొంతు, అల్లరిపై వేసే సెటైర్లతోనే విష్ణు ప్రియ బాగా ఫేమస్ అయింది. సుధీర్‌తో చేసిన పోవే పోరా షో ఆమెకు స్టార్డంను తీసుకొచ్చింది. అంతకు ముందు యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేసింది. అయితే బుల్లితెర మాత్రమే ఆమెకు ఇంతటి ఫాలోయింగ్‌ను తీసుకుంది. ఇక శ్రీముఖితో జట్టు కట్టడం, ప్రాణ స్నేహితుల్లా మారడంతో సోషల్ మీడియలో రచ్చ రచ్చ చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు.
అయితే తాజాగా విష్ణు ప్రియ కాలికి గాయమైనట్టు చెప్పుకొచ్చింది. పైగా ఇలాంటివి తనకు ఇష్టం కూడా అంటూ ఓ థియరీని పేర్కొంది. ఇలా గాయాలు కావడమంటే ఇష్టం. ఐ లవ్ దెబ్బలు.. అవన్నీ నా ఒంటిపై ఎక్స్ ట్రా సామాన్లు.. ఇలాంటి గాయాల వల్లే నా జీవిత ప్రయాణంలో రోడ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ గాయం తగ్గుతోంది అంటూ గొప్పగా చెప్పుకొచ్చింది.
ఏది ఏమైనా ఈ దెబ్బ తగిలి నేటికి ఎనిమిది రోజులు అవుతోంది. నడవడం ఎంతో బాధగా కష్టంగా ఉంది.. కానీ ఇప్పుడు పర్లేదులే బాగానే ఉంది. నేను ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నాను.. అలా చేస్తే మీ అందరి ప్రేమ నాకు దక్కుతుంది.. దట్స్ ది బ్యూటీ ఆఫ్ దెబ్బలు, ఇలా దెబ్బలు తగిలినప్పుడు ఇంకా ఎక్కువగా బుజ్జగింపులు దొరుకుతాయి అంటూ విష్ఱుప్రియ సీక్రెట్ థియరీని బయటకు చెప్పేసింది.