Home Entertainment మనిషి అన్నాక కాస్త సిగ్గుండాలి.. హైపర్ ఆది పరుపుదీసిన వర్షిణి

మనిషి అన్నాక కాస్త సిగ్గుండాలి.. హైపర్ ఆది పరుపుదీసిన వర్షిణి

యాంకర్ వర్షిణి హైపర్ ఆది కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు పండుగే. వరుసగా పంచ్‌లు పడుతూనే ఉంటాయి. ఒకరిపై ఒకరు దారుణమైన సెటైర్లు వేసుకుంటారు. ఆ కెమిస్ట్రీనే జనాలకు బాగా నచ్చింది. ఒకానొక సమయంలో ఈ ఇద్దరికి పెళ్లి కూడా చేసేశారు. ఆది వర్షిణి ప్రేమలో ఉన్నారు.. పెళ్లి చేసుకోబోతోన్నారంటూ యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఆది, వర్షిణి స్పందిస్తూ అవి కేవలం రూమర్లేనని కొట్టిపారేశారు.

Anchor Varshini Satires On Hyper Aadi In Dhee Show
Anchor Varshini satires On Hyper Aadi In Dhee show

తామిద్దరం మంచి స్నేహితులమేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ క్లారిటీ ఇచ్చారు. పైగా వర్షిణి ఎంత అమాయకురాలో సెట్‌లో ఎలా ఉంటుందో.. తమ పరిచయం ఎలా జరిగింది.. మొదట జరిగిన గొడవ ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. ఆది వర్షిణి ప్రస్తుతం ఢీ షోలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. జబర్దస్త్ వేదికపై అందిర మీద పంచ్‌లు వేసే ఆదికి మాత్రం ఢీలో రివర్స్ జరుగుతుంది. వర్షిణి ఆదిని ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో వర్షిణి ఆది పరువును తీసేసింది. ఎంట్రీలో ఓ అదిరిపోయే సాంగ్‌ను వేసుకున్నారు. చెరో వైపు నుంచి ఎంట్రీ ఇవ్వడంతో ఇలా చేస్తే ఎప్పుడు పడుతుంది అని ఆది తన బాధను యాంకర్ ప్రదీప్‌తో చెప్పుకొచ్చాడు. పడుతుంది.. కచ్చితంగా నీకే పడుతుందని నమ్మకంగా చెప్పాడు ప్రదీప్. నాకే పడుతుందా అని మళ్లీ ఆది అడగడంతో నీకు పడుతుంది.. మొదటగా మొహం నుంచి పడుతుంది.. ఆ తరువాత ముక్కులోంచి పడుతుందని కౌంటర్ వేశాడు. ఆ తరువాత హైపర్ ఆది మాట్లాడుతూ.. నువ్ నాకింద తగ్గి ఉండాలి.. వచ్చాక హగ్గు ఉండాలి అని వర్షిణిపై కౌంటర్ వేశాడు. ఆ కౌంటర్‌కు రివర్స్ పంచ్ వేస్తూ.. మనిషన్నాక కాస్త సిగ్గుండాలని ఆది పరువు తీసేసింది.

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

Related Posts

Latest News