యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు, ఇంట్రడక్షన్స్ ఏమీ అవసరం ఉండదు. ఎందుకంటే సుమ అడుగుపెట్టని ఇళ్లు ఆమెను చూడని రోజు, ఆమె మాటని చెవులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఉండవు. అంతలా సుమ ఫేమస్. బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా ఏకఛత్రాదిపత్యాన్ని చాటుతోంది. అనసూయ, రష్మీ లాంటి గ్లామర్ క్వీన్స్ ఎంత మంది వచ్చినా చెక్కు చెదరని స్టార్డంతో ఇంకా టాప్‌లోనే దూసుకుపోతోంది.
అయితే ఇన్నాళ్లు బుల్లితెరపై, లేదా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్లలోనే సుమ అందర్నీ ఎంటర్టైన్ చేసేది. కానీ ఈ మధ్య సోషల్ మీడియలో అంతకు మించి ఫన్ క్రియేట్ చేస్తోంది. లాక్ డౌన్ పుణ్యమా అని సుమ ఇంట్లో ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. సుమ చేసే అల్లరి మాత్రం మామూలుగా ఉండదు. ఈ మధ్యే తన పెట్ జోరోను ఏ రేంజ్‌లో హింసించిందో అందరం చూశాం. జోరో నాటకాలు సుమ ముందు పనిచేయలేదనుకోండి.
తాజాగా తన మేకప్ మెన్స్‌ను పరిచయం చేసిన సందర్భంలో ఒకతనికి వార్నింగ్ ఇచ్చింది సుమ. అతను మాస్క్ తీయడంతో ముందు మాస్క్ పెట్టుకో తరువాత మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ రీసెంట్‌గా లిఫ్ట్‌లొ ఒకరికి గట్టిగా ఇచ్చి పడేసింది. మాస్క్ తీసి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ముందు మాస్క్ పెట్టుకో తరువాత ఫోన్ మాట్లాడుకో అని చెప్పేసింది. కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి అంటూ సుమ అందరికీ జాగ్రత్తలు చెబుతోంది.