స్టాఫ్‌కు శాడిజం చూపిస్తోన్న సుమ.. వీడియో వైరల్

Anchor Suma Video with her Staff

యాంకర్ సుమ అంటే రోజూ ఎంత బిజీగా ఉంటుంది.. రోజుకు ఎన్ని షూటింగ్స్‌లో పాల్గొంటుంది.. ఎన్ని షెడ్యూల్స్ చేస్తుందో చెప్పలేం. రోజంతా బిజీగానే ఉంటుంది. అలాంటి సుమకు తన స్టాఫ్ ఆలస్యం ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు రోజూ రెండు మూడు షోల షూటింగ్‌లు జరుగుతుంటాయి. నాలుగైదు సార్లు క్యాస్టూమ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంటుంది. మేకప్ మార్చుతూ ఉండాల్సి ఉంటుంది. అలా సుమ తన రోజూవారి కార్యక్రమాలకు ఇబ్బంది కలిగితే ఎలా ప్రవర్తిస్తుందో తాజాగా చెప్పుకొచ్చింది.

Anchor Suma Video with her Staff
Anchor Suma Video with her Staff

ఆ మధ్య సుమ తన స్టాఫ్ గురించి చెబుతూ చాలా గొప్పగా కామెంట్ చేసింది. తాను రోజూ ఇన్నిషిఫ్ట్‌లు, ఇన్ని ఈవెంట్లు ఎలా చేయగలుగుతున్నాను.. అలిసిపోరా? అని అందరూ అడుగుతుంటారని చెప్పుకొచ్చింది. తన మేకప్ ఆర్టిస్ట్‌లు, స్టైలిష్ట్‌లు ఇలా అందరూ తమ తమ పనులు ఎంతో చక్కగా టైంకి చేస్తుంటారు.. అలాంటి వారున్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చింది. తాజాగా సుమ తన మేకప్ ఆర్టిస్ట్‌ను శాడిస్ట్‌లా ప్రవర్తిస్తూ ఓ ఆట ఆడుకుంది.

మామూలుగా సుమ 9 గంటల వరకు సెట్‌లో ఉండాలని అంటే… 7 గంటలకు రెడీ అయి ఇంట్లోంచి బయల్దేరాలి. అదే సమయంలో తన స్టాఫ్ కూడా అలానే బయల్దేరాలి. ఇదే విషయాన్ని సుమ చెబుతూ తన మేకప్ ఆర్టిస్ట్ ఒక వేళ నిద్రలేవకపోతే ఇలా చేస్తానంటూ.. ఆమె మొహంపై వాటర్ స్ప్రే చేస్తోంది సుమ. లే మనం చేయాల్సి ఇంకా ఎంతో ఉందని చెబుతుందట. నాకోసం ప్రేమగా ఎన్నో అవుట్ ఫిట్స్ తయారు చేస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ సుమ చెప్పుకొచ్చింది. శాడిస్ట్‌లా చేస్తున్నాను కదా? అని సుమ ఆ వీడియోలో అంటూ రచ్చ చేసింది.