పనిమనిషితో మసాజ్ చేయించుకుంటూ రిలాక్స్ అవుతున్న సుమ.. ఫోటో వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె నటిగా వెండితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ సినిమాలో సుమ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సుమా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అన్ని టివి షోలకు హాజరవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా గత కొద్ది రోజుల నుంచి ఎంతో బిజీగా గడుపుతున్న సుమ రిలాక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ లో తన పని మనిషి గురించి పరిచయం చేసిన సుమ తాజాగా తనతో కలిసి హెడ్ మసాజ్ చేయించుకుని చిల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు.

తల మొత్తం సినిమా ప్రమోషన్ తో నిండిపోయింది.. మసాజ్ చేయించుకుని కాస్త రిలాక్స్ అవుతున్నట్లు వెల్లడించారు. ఇకపోతే ఇది వరకు ఎన్నో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సుమ తాజాగా తన సినిమా కోసం తాను ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అయ్యారు. ఇప్పటివరకు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు పొందిన సుమ జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.