యాంకర్ సుమ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై స్టార్ మహిళ పేరు సంపాదించుకున్న సుమ వెండితెరపై ఈ సినిమాతో ప్రేక్షకులను సందడి చేస్తోంది.దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ ఇప్పటికీ అదే ఎనర్జీ లెవెల్స్ తో ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇలా ఒక వైపు కెరియర్ లో బిజీగా ఉంటూనే మరోవైపు తన ఆరోగ్య విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మరి సుమ ఇలా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకొనే డైట్ ఏంటి అనే విషయానికి వస్తే..
సుమ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆంధ్ర ఫుడ్ అంటేనే తనకెంతో ఇష్టమని వెల్లడించారు. అందుకే తన ఇంట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ అలాగే రోటి పచ్చళ్లు ఉంటాయని సుమ ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఇకపోతే తన ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ ప్రతి రోజు తనకి తప్పకుండా ఆహారంలో ఏదో ఒక ఆకుకూర కంపల్సరిగా ఉండాలని సుమ తెలియజేశారు. అయితే ఆకుకూరలు తాలింపు కన్నా స్టీమ్ కుకింగ్ ద్వారా తినడానికి ఇష్టపడతానని అలా చేస్తేనే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్ని మన ఆరోగ్యానికి మంచి కలిగిస్తాయని వెల్లడించారు.
సుమ డైట్ లో నాన్ వెజ్ చాలా తక్కువగా ఉంటుందని ఎక్కువగా వెజిటేబుల్స్, ఆకుకూరలు ఉపయోగిస్తారని సుమ తెలిపారు. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే తనకు చేపలంటే ఎంతో ఇష్టమని సుమ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనని తెలియజేశారు. ఈ విధమైనటువంటి డైట్ ఫాలో అవడం వల్లే సుమ ఎంతో చలాకీగా వరుస కార్యక్రమాలు , ఈవెంట్ లో చేస్తూ బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు. ఇక సుమ నటించిన జయమ్మ పంచాయతీ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే.