Anchor Suma: తొలి సారిగా తన కోసం ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్న యాంకర్ సుమ..!

Anchor Suma: ఒక భారీ బడ్జెట్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగాలన్నా, కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించాలన్నా ఈమె ఉండాల్సిందే. ఒక మామూలు హీరో, హీరోయిన్ కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉందంటే మామూలు విషయం కాదు. ఆమె ఎవరో కాదు బుల్లితెర ప్రేక్షకులను తన ఫన్నీ జోక్స్ తో, తన మాటలతో కట్టిపడేసే యాంకర్ సుమ.

ప్రారంభంలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినా, అది అంత వర్కవుట్ కాకపోవడంతో యాంకరింగ్ లోకి అడుగు పెట్టి, ఎక్కడ లేని అభిమానాన్ని సొంత చేసుకుంది. మలయాళం బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా, తెలుగులో స్పష్టంగా మాట్లాడే ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం కొన్ని షో లతో టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న సుమ, ఈ మధ్య కాలంలో పలు సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్, ఆడియో రిలీజ్ ఈవెంట్స్ కు యాంకర్ గా చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక పలువురు డైరెక్టర్లకు సైతం తమ సినిమా ఆడియో ఫంక్షన్ కి సుమ యాంకరింగ్ చేస్తే, విజయం సాధిస్తుంది అన్న సెంటిమెంట్లు కూడా ఉన్నయంటేనే ఆమె స్థాయి ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక వివరాల్లోకి వెళితే, చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన సుమ, ప్రస్తుతం జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, ఈటీవీ వాళ్ళు ఉగాది పండగ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సందడి చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు, ఆ సినిమాలో నటించిన పలువురు నటులు కూడా ఈ షోలో పాల్గొని, అలరించనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ సుమను యాంకరింగ్ లో మాత్రమే చూసిన ప్రేక్షకులు, వచ్చే నెలలో విడుదల కాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ ఒక సినిమాను ప్రమోట్ చేసేందుకు అలరించే సుమ, తొలిసారిగా ఆమె నటించిన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ఎదిగిన స్థితిని చూసి అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.