ఎన్నిసార్లు ట్రై చేస్తారు.. షో నిలబట్టేందుకు ఈ సారి సుమపై భారం!!

Anchor Suma Hosts Start Music Show 

బుల్లితెరపై ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలదే హవా. కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, వెరైటీ షోలను జనాలు ఆదరిస్తున్నారు. ఈక్రమంలో అన్నీ చానెల్స్ కూడా ఎంటర్టైన్మెంట్ షోలను ప్లాన్ చేశాయి. చేస్తూనే ఉన్నాయి కూడా. అలా స్టార్ మా స్టార్ట్ మ్యూజిక్ అనే ఓ షో ఉంది. అయితే ఇది ఇప్పుడు సుమ చేతుల్లోకి వెళ్లింది. అంతకు ముందు ఇది ఝాన్సీ వ్యాఖ్యాతగా మొదలైంది. ఆ తరువాత కాస్త మార్పులు చేర్పులు చేసి శ్రీముఖి ఖాతాలో వేశారు.

Anchor Suma Hosts Start Music Show 
Anchor Suma Hosts Start Music Show

అయితే ఈ ఇద్దరూ కూడా షోను సక్సెస్ చేయలేకపోయారు. ఇద్దరూ చేతులెత్తేశారు. అలా స్టార్ట్ మ్యూజిక్ అనే షో మూలకు పడిపోయింది. అసలే ఇప్పుడు స్టార్ మా చానెల్‌కు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ షో లేదు. ఉన్న ఒక్క బిగ్ బాస్ షో అయిపోయింది. డ్యాన్స్ ప్లస్ దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక కొత్తగా చేసేదీ ఏమీ లేక మూలన పడ్డ ఆ స్టార్ట్ మ్యూజిక్ షోనే మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ సారి ఆ బాధ్యతను సుమకు అప్పగించారు.

సుమ వ్యాఖ్యాతగా ఉంటే షో మినిమం హిట్. అందులో భాగంగా ఓ చిన్న ప్రోమో వదిలారు. సుమ హోస్టింగ్ అంటే ఎవ్వరైనా సరే వచ్చేస్తారు. అందులో భాగంగానే బిగ్ బాస్ కంటెస్టెంట్లు, కార్తీక దీపం సీరియల్ మెంబర్స్ ఇలా అందర్నీ పట్టుకొచ్చింది. అందరితోనూ ఓ లెవెల్‌లో ఆట ఆడిస్తోన్నట్టుంది. మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్లను, వారి ఇమేజ్‌ను స్టార్ మా ఇలా వాడేసుకుంటోంది. మరి సుమ చేతిలోనైనా స్టార్ట్ మ్యూజిక్ హిట్ అవుతుందేమో చూడాలి.