Anchor Suma: క్యాష్ ప్రోగ్రామ్ లో రచ్చ రవి మీద మండిపడ్డ యాంకర్ సుమ.. ప్రోమో కోసం ఏమైనా చేస్తారా అంటూ ఆగ్రహం..!

Anchor Suma: బుల్లితెర లేడి యాంకర్లలో సుమ గారికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమ తన యాంకరింగ్ తో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ లేడీ యాంకర్ గా కొనసాగుతోంది. సుమ పలు టీవీ షోలతో పాటు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు కూడా చేస్తూ నిత్యం బిజీగా ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కి సుమ గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా సుమ తన యాంకరింగ్ తో షో కి వచ్చిన కంటెస్టెంట్ లతో కొత్త కొత్త టాస్క్ లు చేయిస్తూ ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తోంది. ఇటీవల ఈ క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈవారం ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం లో కమెడియన్లు రచ్చ రవి, బద్రం, ఆలీ తమ్ముడుఖయ్యుమ్ తదితరులు పాల్గొన్నారు. రచ్చ రవి జబర్దస్త్ షో లో గత కొన్ని సంవత్సరాలుగా తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల రచ్చ రవి క్యాష్ షో లో సందడి చేశారు. ఈ షోలో రచ్చ రవి, సుమ మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ షోలో రచ్చ రవి మాట్లాడుతూ.. ఈ సారైనా నన్ను గెలిపించండి అంటూ సుమ ని వేడుకున్నాడు. ఇంతకుముందు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా విన్నింగ్ ఎపిసోడ్ ఇవ్వలేదు అని ప్రశ్నించాడు. దీనికి సుమ కూడా కొంచెం ఘాటుగా సమాధానం ఇచ్చింది.

రచ్చ రవి అంతటితో ఆగకుండా అక్కడ కూర్చొని ఎంతమందికి సమాధానాలు చెప్పి ఉంటావో అని అన్నాడు. అందుకు సుమ తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఎవరికి సమాధానం చెప్పాను అని అంటుంది. అప్పుడు రచ్చ రవి మాట్లాడుతూ.. ఊరుకో అమ్మ అంటూ ఏదో అనేశాడు. ఆ మాటలు ప్రేక్షకులకు వినిపించకుండా బీప్ సౌండ్ వేశారు. సుమ తీవ్ర ఆగ్రహానికి గురై ప్రోమో కోసం ఏమైనా చేస్తారా ? స్టుపిడ్, ఇడియట్ అంటూ తన వద్ద ఉన్న ప్రోగ్రాం షీట్ కింద పడేసి రచ్చ రవి ని అనకూడని మాట అనేసింది. ఈ ప్రోమో చూసిన ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరి మధ్య నిజంగానే గొడవ జరిగిందా లేక ప్రోమో కోసం ఇలా చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.