షూటింగ్‌లు లేకపోతే చేసే పనులివే.. సుమ ఫన్నీ వీడియో

బుల్లితెరైనా, సినిమా ఫంక్షన్ అయినా, ఈవెంట్ ఏదైనా సరే సుమ అడుగుపెడితే అక్కడంతా సందడి సందడే. తెరపై సుమ ఎలా ఉంటుందో ఇన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ లాక్డౌన్ పుణ్యమా అని సుమ తన ఇంట్లో ఎలా ఉంటుందో కూడా తెలిసిపోయింది. తెరపై ఎంత యాక్టివ్‌గా, చలాకీగా ఉంటుందో ఇంట్లోనూ అంతే అల్లరి చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ విషయాలన్నీ సుమే స్వయంగా ప్రకటించింది.

Anchor Suma Fun WIth Pet Zoro
Anchor Suma Fun WIth Pet Zoro

లాక్ డౌన్‌లో ఇంట్లో ఉంటూ చేసిన పనులను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసేది. తోటలో ఆడుకున్న వీడియోలు, ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోలు, తన పెట్ జోరోను డ్యాన్స్‌తో బయపెట్టిన ఘటనలను ఇలా ఎన్నెన్నో వీడియోలను షేర్ చేసింది. మామూలుగా సుమ చేసే షోలకు, ఉన్న బిజీ షెడ్యూలక్ వారానికి ఏడు రోజులు కూడా సరిపోతున్నాయో లేదో. అయితే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుందో తాజాగా అందరికీ చూపించింది.

Anchor Suma Fun WIth Pet Zoro
Anchor Suma Fun WIth Pet Zoro

తనకు షూటింగ్‌లు లేక ఇంట్లో ఉన్నప్పుడు చేసే పనులివే అంటూ సుమ ఓ వీడియోను షేర్ చేసింది. తన పెట్ ప్రశాంతంగా నిద్రపోతోందని కూడా వదిలేయలేదు సుమ. జోరోను చిత్రహింసలు పెట్టింది. ఓ మూలకు పోయి పడుకున్న జోరోను గెలికి మరీ లేపేందుకు ట్రై చేసింది. అయితే మొదటి సారి డిస్టర్బ్ చేసినప్పుడు లేచిన జోరో.. ఆపై ఎన్ని రకాలుగా ట్రై చేసినా లేవలేదు. సుమ చేష్టలను పసిగట్టిన జోరో సుమ కంటే మొండిగా ఉన్నట్టుంది. మొత్తానికి ఈ వీడియో బాగానే వైరల్ అవుతోంది.