Anchor Suma: క్యాష్ షోలో రెచ్చిపోయిన సుమ.. మెగా అభిమానులు మడత పెట్టేలా కామెంట్స్..!

Anchor Suma: బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలలో సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది. ఇక సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రాం కి గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షో కి వచ్చే ఎంతో మంది సెలబ్రెటీలను సుమ తన పంచులతో ఒక ఆట ఆడుకుంది. ఇటీవల క్యాష్ షో కి సంబంధిన ప్రోమో ఒకటి విడుదల అయ్యింది. ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ షో లో పాత హీరోలు వెంకట్, పృథ్వి, రోహిత్, హీరోయిన్ ప్రేమ సందడి చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుమ సాధారణంగా షో కి వచ్చిన వాళ్ళ అందరి చేత ఫన్నీ టాస్క్ లు ఆడించి ఎంతో సందడి చేస్తుంది. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆమె వేసే పంచులకు నవ్వి ఊరుకుంటారు తప్ప సీరియస్ అయిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇటీవల విడుదలైన ప్రోమో లో సుమ మెగా ఫ్యాన్స్ కి కోపం వచ్చేలా కామెంట్స్ చేసింది. తర్వాత రియలైజ్ అయ్యి దాన్ని కవర్ చేయటానికి ట్రై చేసింది. గేమ్ షో లో భాగంగా హీరో వెంకట్ నీ సుమ ఒక ప్రశ్న అడుగుతుంది. హీరో నాగార్జున గారితో పని చేయటం ఇష్టమా? లేక చిరంజీవిగారితో పనిచేయటం ఇష్టమా? అని అడిగింది. అందుకు వెంకట్ సమాధానం చెప్తూ నేను చిన్నప్పటి నుంచీ చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్తాడు. అప్పుడు సుమ మాట్లాడుతూ.. మీరు చిన్నప్పట్నుంచి చిరంజీవి గారికి ఫ్యాన్, కానీ.. ఆయన చిన్నప్పటి నుంచీ నాకు ఫ్యాన్ అని నోరు జారింది.

సుమ అన్న మాటలకి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుమ వెంటనే తేరుకొని దాన్ని కవర్ చేయటానికి ప్రయత్నం చేస్తూ పేపర్ చేతిలో పట్టుకుని నలిపేసి ఆయన అభిమానులు నన్ను ఇలా మడతపెడతరు కదా అని అంటుంది. ఇలా సుమ క్యాష్ షో లో మెగా అభిమనులకి కోపం వచ్చేలా మాట్లాడింది.అయితే ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలోస్వయంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు సుమ కి మేము పెద్ద ఫ్యాన్స్ అని చెప్పారు. దీంతో సుమ అన్న మాటలు మెగా ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకుంటారో? లేక అందరిలా వాళ్ళు కూడా నవ్వుకుంటారో చూడాలి మరి.