అర్దరాత్రి మేకప్ వేసుకుని రెడీగా ఉంది.. యాంకర్ సుమ వీడియో వైరల్

Anchor Suma about Lucky Mahila USA Show

యాంకర్ సుమ బుల్లితెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సుమ చేసే రచ్చకు బుల్లితెరపై అంతా ఫిదా అవుతూ ఉంటుంది. ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే సుమ పంచ్ వేస్తే సర్దుకోవాల్సిందే. సుమ మాటల ప్రవాహానికి ఎవ్వరూ అడ్డుగా నిలవలేరు. సుమకు గల వాక్ఫటిమతోనే ఇన్నేళ్లైనా బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా వెలిగిపోతోంది. సుమ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయింది. బుల్లితెరపై ఎంతటి ఫన్ క్రియేట్ చేస్తోందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా రచ్చ చేస్తోంది.

Anchor Suma about Lucky Mahila USA Show
Anchor Suma about Lucky Mahila USA Show

యాంకర్ సుమ ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పెడుతోంది. తన పెంపుడు కుక్క జోరోను ఎలా విసిగిస్తుందో.. పని మనిషిని ఎలా ఆటపట్టిస్తుందో.. ఇంట్లో ఎలా ఉంటుందో.. మాస్కులు ధరించకుండా ఎవరైనా కనిపిస్తే ఎలాంటి క్లాసులు తీసుకుంటుందో అంటూ వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్లను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఒక వైపు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మరో వైపు కరోనా, మాస్కులు ధరించడం పట్ల ఉండాల్సిన అవగాహనను కల్పిస్తూ ఉంటుంది.

తాజాగా సుమ అర్దరాత్రి కూడా మేకప్ వేసుకుని రెడీగా ఓ షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అమెరికాలోని ఎన్నారైల కోసం నిర్వహిస్తోన్న లక్కీ మహిళ అనే షో కోసం అర్దరాత్రి పదకొండు గంటలకు మేకప్ వేసుకుని రెడీగా ఉంది. మామూలుగా అయితే ఇది ప్రతీసారి రాత్రి పదిగంటలకు ఉండే ప్రోగ్రాం.. ఈ సారి పదకొండు గంటలకు ప్రారంభమైందని తెలిపాడు. మనకు రాత్రి అయితే వారికి ఉదయం కదా అని తన బాధలను చెప్పుకుంటూ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.