సిటీలో మనం మిస్ అయ్యేది అదే.. సుమ వీడియో వైరల్

Anchor Suma about Fresh air

యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత ఫన్నీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఏది చెప్పినా కూడా హ్యాస్యాన్ని జోడిస్తూ ఎంటర్టైన్ చేస్తూనే చెబుతూ ఉంటుంది. అందుకే సుమ కరోనా జాగ్రత్తలు, కోవిడ్ నిబంధనలు, సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం ఇలా ఎన్నింటిపై అవగాహన కలిగించినా కూడా సరదాగా వీడియోలు చేస్తూ చెప్పుకొచ్చింది. అలా సుమ షేర్ చేసే వీడియోలన్నీ కూడా తెగ వైరల్ అవుతుంటాయి.

Anchor Suma about Fresh air
Anchor Suma about Fresh air

అయితే సుమ ఈ మధ్య తన మేకప్ ఆర్టిస్ట్‌ల గురించి ఎక్కువగా చెబుతూ ఉంది. మేకప్ బృంధం లేకపోతే తాను ఇంత పని చేయలేనని, వారి వల్లే తనకు ఇవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పుకొచ్చింది. తాజాగా తన మేకప్ మెన్స్ గురించి చెబుతూ సుమ షేర్ చేసిన వీడియో బాగానే వైరల్ అయింది. అందులో రమేష్ అనే వ్యక్తిపై సుమ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. పని లేకపోయినా సరే కెమెరా పెడితే చాలు వస్తాడని పంచ్ వేసింది.

తాజాగా సుమ మరో వీడియోను షేర్ చేసింది. ఇందులో స్వచ్చమైన గాలి, పచ్చని చెట్లు, వందల ఏళ్ల నాటి మర్రిచెట్టును చూపించిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. దాని ఊడలను చూపిస్తూ మన బిల్డింగ్ పునాదుల కంటే ఎంతో బలంగా ఉంటుందని, మనం సిటీలో మిస్ అయ్యేది స్వచ్చమైన గాలి.. ఆక్సిజన్.. ఇలా మధ్య మధ్యలో వచ్చి సిలిండర్‌లా మనం నింపుకుని పీల్చుకుని పోవాలంటూ సుమ చెప్పుకొచ్చింది.