Anchor Shiva: అన్నయ్య అని బాంబు పెల్చావు కదా.. అని హర్ట్ అయినా యాంకర్ శివ.. అసలేం జరిగిందంటే!

Anchor Shiva: ఇప్పటి ప్రేక్షకులకు యాంకర్ శివ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. శివ మన మీడియా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సోషల్ మీడియా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిన్న సెలబ్రిటీల నుంచి పెద్ద సెలబ్రిటీల ను ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళ లూప్ హోల్స్ ను వేరే స్థాయిలో నెటిజన్ల ముందు పెడతాడు.
ఇక ఆలా ఎందరో టిక్ టాక్ సెలబ్రిటీ లను ఇంటర్వ్యూ తీసుకుని సోషల్ మీడియాలో వేరే స్థాయిలో వెలుగుతున్నాడు యాంకర్ శివ. తాజాగా ఓటీటీ రూపంలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో అడుగు పెట్టాడు. నిన్న అనగా మొదటి రోజు బాగానే హడావుడి చేసాడు శివ.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారిని వారియర్స్ గా, కొత్తగా వచ్చిన వారిని ఛాలెంజర్స్ గా వేరు చేసారు.
ఇక వారియర్స్ కేటగిరి విషయానికొస్తే.. ఆశు రెడ్డి, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, తేజస్వి, హ మీద, నటరాజ్ మాస్టర్, అరియనా గ్లోరీ, అఖిల్, సరయులు వచ్చారు. ఇది చాలెంజర్ ల కేటగిరి విషయానికి వస్తే బిందు మాధవి, అనిల్ రాథోడ్, శ్రీ రాపాక, మిత్రశర్మ, స్రవంతి చుక్కరపు, అర్జె చైతూ, యాంకర్ శివ లు వచ్చారు.

ఇక మిత్ర శర్మ బిగ్ బాస్ హౌస్ లోకి అడిగిన అడుగుపెట్టిన వెంటనే అందర్నీ అన్నా అని పిలిచేస్తుంది. దీంతో అందరూ మిత్రశర్మ అని పలకరించడానికి భయపడుతున్నారు. ఇక యాంకర్ శివాను కూడా మిత్రశర్మ అన్నా అని పిలిచింది. దీంతో శివ ఘోరంగా హర్ట్ అయ్యాడు. ఇక అన్నా అని బాంబు పెల్చావు కదా అంటూ మిత్ర శర్మ కు పులిహోర కలపడం స్టార్ట్ చేసాడు శివ.ఇక శివ వ్యక్తిగత విషయానికొస్తే.. శివ తండ్రి ఒక న్యూస్ ఛానల్ లో పనిచేసే కార్ డ్రైవర్. తన తండ్రి పేరు రామారావు శివా తన స్కూలింగ్ మొత్తం వైజాగ్ లో పూర్తి చేశాడు. ఇక ఇంటర్మీడియట్ ఆపై గ్రాడ్యుయేషన్ శ్రీకాకుళం లో పూర్తి చేశాడు.