ముందు నుయ్యి వెనుక గొయ్యి.. యాంకర్ రవిని అలా ఇరికించిన సుమ

యాంకర్ సుమతో అంత ఈజీ కాదు. సుమతో పంచ్‌లు, ప్రాసల్లో ఢీ కొట్టే వారెవ్వరూ ఇంకా బుల్లితెరపై అడుగుపెట్టలేదు. పెట్టరు కూడా. అలాంటి సుమ బుల్లితెరపై అందర్నీ ఎలా ఆడుకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య సుమ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. కరోనా అంటూ భౌతిక దూరం, మాస్క్‌ల ధరించడంపై అవగాహన కల్పిస్తూ ఎంతో హల్చల్ చేస్తోంది. సుమ తన షోల్లో చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

Anchor Ravi In Suma Cash show,Anchor Suma
Anchor Ravi In Suma Cash show,Anchor Suma

స్టార్ మహిళా, క్యాష్ వంటి షోల్లో సుమ తన ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటుంది. అవతలి వాళ్లు ఎన్ని కౌంటర్లు వేసినా చివరకు మాత్రం వారికి ఒక్క సెటైర్ ఇచ్చి నోరు మూసేలా చేస్తుంది. వచ్చే వారం క్యాష్ ఎపిసోడ్‌లో నలుగురు సెలెబ్రిటీలు పాల్గొననున్నారు. అందులో వారు తమ తల్లితో పాటు విచ్చేయనున్నారు. యాంకర్ రవి, వర్షిణి, కెవ్వు కార్తీక్, భాను శ్రీ ఇలా అందరూ తమ తమ తల్లిని తీసుకొచ్చారు.

Anchor Ravi In Suma Cash show,Anchor Suma
Anchor Ravi In Suma Cash show,Anchor Suma

ఈ షోలో యాంకర్ రవి అడ్డంగా బుక్కయ్యాడు. క్యాస్ సుమ బాస్కెట్ బాల్ లీగ్ ఆడిస్తుందన్న సంగతి తెలిసిందే. ఓ ప్రశ్నను అడిగుతుంది.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలంటే బాస్కెట్ బాల్‌ను నెట్‌లొంచి సరిగ్గా వేయాలి. అందులోంచి పడితే ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. ఎవరితో యాంకరింగ్ చేసి తప్పు చేశావని అనుకుంటున్నావ్? అంటూ రవిని ఇరికించే ప్రయత్నం చేసింది సుమ. మొత్తానికి రవికి ముందు నొయ్యు వెనుక గొయ్యి అనే పరిస్థితికి వచ్చాడు. మరి దీనికి సమాధానం చెప్పి రవి ఇరుక్కుంటాడా? లేదా అన్నది చూడాలి. అసలే రవికి శ్రీముఖి, లాస్య వంటివారు శత్రువులుగా మారిన సంగతి తెలిసిందే.