Big Boss Non Stop: బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి.. ఇమిటేట్ చేస్తూ రచ్చ!

Big Boss Non Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మరికొన్ని రోజులలో ముగియనుండటంతో ఎప్పటిలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ హౌస్ లోకి పంపిస్తున్నారు. ఇప్పటికే మానస్ , సిరి హనుమంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ లను ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే యాంకర్ రవి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈయన హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే కంటెస్టెంట్ లతో కలిసి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించారు.

హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే రవి అరియానతో కలిసి స్టెప్పులు వేయగా అనంతరం బాబా భాస్కర్ మాస్టర్ తో కూడా డాన్స్ వేశారు.అనంతరం రవి మాట్లాడుతూ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాను అంటే ప్రేక్షకులు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మరి వారికి ఎంటర్టైన్మెంట్ అందించాలని రవి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లను సోఫాలో కూర్చో పెట్టి వారు బిగ్ బాస్ హౌస్ లో ఏ విధంగా నడుచుకుంటున్నారు. అనే విషయాల గురించి ఇమిటేట్ చేశారు.

ఈ విధంగా ముందు నటరాజ్ మాస్టర్ తో ప్రారంభించి నటరాజ్ మాస్టర్ చేసిన విధంగానే ఇమిటేట్ చేయడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నవ్వుకున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని కూడా రవి ఇమిటేట్ చేస్తూ సందడి చేశారు. అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు వారి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ గురించి కూడా తెలియజేశారు.మొత్తానికి యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో కంటెస్టెంట్ లకు కాస్త బూస్టప్ ఇచ్చినట్లయింది.