Gallery

Home Entertainment పెళ్లి అయింది కాబట్టి రాత్రంతా పడుకోడు.. యాంకర్ రవిపై వర్షిణి కామెంట్స్ వైరల్

పెళ్లి అయింది కాబట్టి రాత్రంతా పడుకోడు.. యాంకర్ రవిపై వర్షిణి కామెంట్స్ వైరల్

యాంకర్ వర్షిణి, రవి తెరపై ఎంత క్లోజ్‌గా ఉంటారో.. తెర వెనుకా అంతకంటే ఎక్కువ సన్నిహితంగా ఉంటారు. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సరికొత్తగా ఓ షో రాబోతోన్నట్టుంది. దీంట్లో బుల్లితెర జంటలను తీసుకొచ్చి ఆటలు ఆడించబోతోన్నట్టు కనిపిస్తోంది. అలాంటి ఈ షోకు యాంకర్ రవి, వర్షిణిలు హోస్ట్‌లు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ షో షూటింగ్ కోసమే నిన్న ఆ వాట్సప్ చాట్ బయటకు వచ్చిందని తెలుస్తోంది.

Anchor Ravi And Varshini Funny Conversation In Shoot Gap
Anchor Ravi and varshini Funny conversation in shoot gap

హై హీల్స్ వేసుకోకు ప్లీజ్ అంటే రవి బతిమాలడం, అలా మెసెజ్ చేయడంతో దాన్ని వర్షిణి ఇన్ స్టాలో పోస్ట్ పొట్టి వాళ్ల కష్టాలు అని చెప్పుకురావడం.. దానిపై రవి వెరైటీగా స్పందించడం అందరికీ తెలిసిందే. నీ యంకమ్మ నిజంగానే పెట్టావా? ఎంట్రీ సాంగ్ ఉంది కాబట్టి హై హీల్స్ వేసుకోకు అని చెబితే నీకు అలా అర్థమైందా? అంటూ వర్షిణికి రవి కౌంటర్ వేశాడు. అయితే నిన్న ఉదయం 8 గంటలకు మొదలైన షూటింగ్ నేడు తెల్లవారు ఝాము వరకు నడించిందట.

మధ్యలో యాంకర్ వర్షిణి నిద్రపోతోన్న వీడియోను రవి తీశాడు. అలా వీడియో తీస్తుండగా.. వర్షిణి మేల్కొంది. షూటింగ్ చేయమంటే నిద్రపోతోంది చూడండి అంటూ వర్షిణి పరువుతీశాడు రవి. ఉదయం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా షూటింగ్ చేస్తుంటే ఈ సమయంలో నిద్ర రాదా? నీకంటే పెళ్లి అయింది కాబట్టి నిద్ర రాదు.. నేను సింగిల్‌ని నిద్రపోక ఏం చేస్తాను.. అని వర్షిణి చెప్పుకొచ్చింది. పెళ్లైతే నిద్రపోమని ఎవరు చెప్పారే అంటూ వర్షిణిని రవి నిలదీశాడు. నువ్వే చెప్పావ్ రాత్రి నిద్రపోను అని అంటూ రవి గుట్టు విప్పింది వర్షిణి. ప్రస్తుతం ఈ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు బాగానే వైరల్ అవుతోన్నాయి.

- Advertisement -

Related Posts

40 రోజుల్లో రాజమౌళి నుండి విడుదల పొందనున్న చరణ్, ఎన్టీఆర్

  రాజమౌళి సినిమా అంటే చాలా ఓపిక ఉండాలి. ఆయనతో సినిమా చేయాలి అనుకుంటే కనీసం రెండేళ్లు ఆయానకు అంకితం చేయాల్సిందే ఏ హీరో అయినా. అంటే రెండేళ్ల పాటు వెండితెర మీద కనబడరనే...

ఉపాసన చేతికి అరుదైన, కీలకమైన బాధ్యతలు

  ఉపాసన కొణిదెల సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటారు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడ నిర్వర్తిస్తుంటారు. ఇటీవల కాలంలో కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రజల్లో అవగాహన...

‘మా’ ఎన్నికల బరిలోకి లేడీ..రసవత్తరంగా మారిన పోటీ

మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.  ఎప్పుడో సెప్టెంబర్లో జరగబోయే ఎన్నికల వేడి ఇప్పటి నుండే ఇండస్ట్రీని తాకుతోంది. బలమైన వ్యక్తులు బరిలోకో దిగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది....

Latest News