యాంకర్ రవి ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఓ వైపు అదిరింది షో, మరో వైపు నువ్వు రెడీ నేను రెడీ అనే కొత్త షో. ఇలా బుల్లితెరపై ఫుల్ సందడి చేసేస్తున్నాడు యాంకర్ రవి. ఇక యాంకర్ రవి పనిలో ఎంత నిమగ్నమైనా సరే కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తాడు. మరీ ముఖ్యంగా తన ప్రాణమైన కూతురు వియాతో మరింత సమయాన్ని గడుపుతుంటాడు. యాంకర్ రవికి తన కూతురిపై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.
ఆ మధ్య ఓ స్పెషల్ ఈవెంట్‌లో కూతురితో కలిసి ప్రత్యేకంగా పర్ఫామ్ చేశాడు రవి. గుమ్మాడి గుమ్మాడి అనే పాటకు పర్ఫామ్ చేసి కూతురిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఇక వీలైనంతగా వియాతో టైం గడిపేందుకు ప్రయత్నించే రవి.. లాక్ డౌన్ ఫుల్ హల్చల్ చేశాడు. యాంకర్ రవి, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా ఇలా అందరూ కలిసి ఆ మధ్య వియాతో ఓ ఆట ఆడారు. ఎవరింట్లో వారు ఉంటూనే ఈ ఆటను ఆడారు.
హైడ్ అండ్ సిక్ అనే ఆ ఆటలో వియా చేసిన అల్లరి అందరికీ తెలిసిందే. అయితే ఆ వీడియోను రోజులో కనీసం ఒక్కసారైనా చూస్తానని యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. ఎంతి బిజీ ఉన్నా.. రోజులో కనీసం ఒక్కసారైనా సరే ఈ వీడియోను చూస్తాను.. నా స్ట్రెస్ మొత్తం పోతుంది. జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు అనసూయ, రాహుల్, అలీ రెజాలకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చాడు.