యాంకర్ ప్రదీప్ పెద్ద జాక్ పాట్ కొట్టేశాడు.. ఓ బడా రాజకీయ నేత కూతురితో పెళ్లి

Anchor Pradeep Marriage fix WIth Big Politician Daughter

యాంకర్ ప్రదీప్ పెళ్లి వార్తలు గత కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి. ప్రతీ ఈవెంట్, ప్రతీ స్కిట్, ప్రతీవారు ప్రదీప్ పెళ్లిపై సెటైర్లు వేస్తూనే ఉంటారు. బుల్లితెరపై ప్రదీప్, రష్మీ, సుధీర్ వంటి సెలెబ్రిటీల పెళ్లిళ్లలపైనే నిత్యం టాపిక్స్ నడుస్తుంటాయి. అయితే అందులో మరీ ముఖ్యంగా ప్రదీప్ పెళ్లి వార్తలు మాత్రం ఏదో రకంగా బయటకు వస్తూనే ఉంటాయి. అవి ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తూనే ఉంటాయి.

ఈ మధ్య ప్రదీప్ కూడా తన పెళ్లిపై కామెంట్ చేశాడు. అది ఇంట్లో వాళ్లు చూస్తారని, వాళ్లు చూపించిన అమ్మాయినే చేసుకుంటానని ఓ షోలో కామెంట్ చేశాడు. అయితే ఈ లాక్ డౌన్ పుణ్యమా అని ప్రదీప్‌కు ఓ అమ్మాయి దొరికినట్టు కనిపిస్తోంది. ఇక పెళ్లి బాజాలు మోగబోతోన్నాయి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజమున్నదన్నది చూడాలి.

Anchor Pradeep Marriage fix WIth Big Politician Daughter

ఇక ఆ అమ్మాయి వివరాలివే అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. చూసి చూసి ప్రదీప్ గట్టి బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయినే చూసుకున్నాడని తెలుస్తోంది. ఆమె ఒక బడా రాజకీయ నేత కూతురని రకరకాల కథనాలు జోరుగా ఊపందుకున్నాయి. మరి వీటిపై ప్రదీప్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అనూహ్యంగా పెళ్లి ఫిక్స్ అయిందని చెబుతాడో లేదా గాలి వార్తలే అని కొట్టిపారేస్తాడో.