Bigg Boss Non Stop: యాంకర్ శివ టాప్ ఫైవ్ లో ఉన్నాడు అంటూ..

Bigg BossNon Stop: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఫ్యామిలీ మెంబర్స్ ఎపిసోడ్ జరుగుతుంది. ప్రతి సీజన్లోనూ చివరి వారాలలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ను బిగ్ బాస్ వేదికపైకి పిలిపించి బయట వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది గేమ్ ఎలా ఆడాలి అనే విషయాల గురించి చూచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యాంకర్ శివ కోసం తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి యాంకర్ ధనుష్ అలాగే షణ్ముఖ్ జస్వంత్ వేదికపైకి వచ్చారు. ఇక షణ్ముఖ్ జస్వంత్ అరియానతో మాట్లాడుతూ ఉండగా శివ యాంకర్ ధనుష్ కి సైగలు చేశారు.

నాగార్జున పక్కన ఉండగానే యాంకర్ ధనుష్ యాంకర్ శివకు సైగలు చేశారు. యాంకర్ శివ గేమ్ బాగా ఆడుతున్నారా అని తను టాప్ ఫైవ్ లో ఉన్నట్లు ధనుష్ చేతివేళ్ళతో తనకు హింట్ ఇచ్చారు. ఇక ధనుష్ చేసిన సైగలను అర్థం చేసుకున్న శివ ఒక్కసారిగా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా యాంకర్ శివ తన టాప్ ఫైవ్ లో ఉన్నావని ధనుష్ నాగార్జున పక్కన ఉండగానే ఈ విషయాన్ని శివకు తెలియ చేశాడు.

యూట్యూబ్ బోల్డ్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శివ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కూడా తన పులిహోర ప్రయత్నాలు చేస్తూనే నిత్యం ఏదో ఒక వివాదానికి తెర లేపుతున్నాడు. ఇకపోతే యాంకర్ శివ ఒక టాస్క్ లో భాగంగా నాగార్జున చేత బాగా చీవాట్లు తిన్న విషయం మనకు తెలిసిందే. అలాగే శివ లేడీ గెటప్ వేసి ఆశు రెడ్డిని లోదుస్తులు అడుగుతూ, విప్పి చూపించు అంటూ దారుణంగా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది.