పసుపు పచ్చ కోకలో తళుక్కుమన్న అనసూయ.. ఈమె అందాల విందుకు ఫిదా అవుతున్న నెటిజన్స్!

బుల్లితెర జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఈ రంగమ్మత్త. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అనసూయ మాత్రం సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.

ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఎప్పుడు వెస్ట్రన్ డ్రెస్ లోనే కాకుండా కొన్నిసార్లు చీరకట్టులో కూడా ఈ ముద్దుగుమ్మ మెరిసి పోతూ ఉంటారు. తాజాగా పసుపు రంగు చీర ధరించి ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అనసూయ అందాల విందుకు ఫిదా అయ్యారు. ఇక ఎప్పటిలాగే నెటిజనులు ఈ ఫోటోపై తమదైన శైలిలో కామెంట్ వర్షం కురిపించారు. ఇక మరికొందరైతే ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అనసూయ చీరకట్టులో కుర్రకారులను మరోసారి సందడి చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అయిదారు సినిమాలతో అనసూయ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమంతో పాటు సూపర్ సింగర్స్ జూనియర్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.