అనసూయ భరద్వాజ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఓ వైపు బుల్లితెర కార్యక్రమాలు, మరో వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మరో వైపు సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు, పలకరించం ఇలా ఎన్నెన్నో పనులతో అనసూయ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఈ మధ్య అనసూయ మరో పనిని కూడా మొదలెట్టేసింది. ప్రతీ రోజూ వర్కవుట్లు చేయాల్సిందే అని భీష్మించుకుని కూర్చుంది.
ఏది ఏమైనా సరే వర్కవుట్లు మాత్రం మానేది లేదని చెబుతోంది. మామూలుగా అయితే అనసూయ వీకెండ్‌లో ఎటువంటి షూటింగ్‌లను పెట్టుకోదు. ఆ రెండు రోజులను ఇంట్లోనే ఉంటుంది. కనీసం అలా వీకెండ్‌లో అయినా తన పిల్లలు, భర్తతో గడిపేందుకే ఆ నిర్ణయం తీసుకున్నానని, ఎంతో తప్పనసరి పరిస్థితి అయితే తప్పా వీకెండ్‌లో షూటింగ్‌కు వెళ్లనని అనసూయ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే ఈ వీకెండ్‌ను అనసూయ గట్టిగానే సెలెబ్రేట్ చేసుకున్నట్టుంది. అయితే ఎంత వీకెండ్ అయినా కూడా వర్కవుట్లు మాత్రం చేయాల్సిందే కదా. అయితే వీకెండ్ రోజున మాత్రం తన భర్తతో కలిసి వ్యాయామం చేస్తుందట. ఈ మేరకు ఓ వీడియోను కూడా పెట్టేసింది. ఇద్దరం కలిసే జిమ్ చేస్తున్నామని తెలిపింది. ఇంట్లోనే వర్కవుట్లు.. మిత్ మై మిస్టర్ అని చెబుతూ జిమ్ ఏరియాను అనసూయ చూపించేసింది.