అనసూయ గురించి, ఆమె ప్రేమ కథ, పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆ మధ్య అలీతో సరదాగా షోలో పాల్గొన్న అనసూయ మరోసారి ఈ విషయాల గురించి కూలంకషంగా చర్చించింది. వివరించింది. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, డిప్రెషన్‌లోకి వెళ్లిన నాటి అనుభవాలు, ఆ సమయంలో భర్త, బంధువులు ఎలా అండగా నిలిచారన్న విషయాలను చెబుతూ ఎమోషనల్ అయింది. అదే సమయంలో భర్త చెప్పిన మాటలకు అనసూయ కన్నీరు పెట్టేసుకుంది.
అనసూయ , సుశాంక్ భరద్వాజ్‌తో ప్రేమలో పడటం, ఆయన ఎలా ప్రపోజ్ చేశాడన్న సంగతి? ఆపై ఇంట్లో సంగతి తెలియడం, అప్పట్లో ఎదుర్కొన్న బాధలు ఇలా అన్ని విషయాలను చెబుతూ ఎమోషనల్ అయింది. ఇక భర్తపై అనసూయకు ఎంత ప్రేమ ఉందో.. అంతే ప్రేమ ఆయనకు కూడా ఉందని ఇట్టే అర్థమైంది. అనసూయ చాలా స్ట్రాంగ్ అని, ఆమె ఎలాంటిదో తనకు తెలుసని, ఆమెను ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా ఎంతో ధృడంగా నిలబడిందని అనసూయ గురించి సుశాంక్ చెప్పుకొచ్చాడు.
ఇలా వీరిద్దరి మధ్య అన్యోన్య బంధం ఉందని మరోసారి అందరికీ తెలిసిందే. తాజాగా అనసూయ సండే ఫండేను ఎలా గడిపిందో వివరించింది. ఇంటి బయట తన భర్త, పిల్లలు, చుట్టు పక్కల వారంతా కలిసి క్రికెట్ ఆడుతున్నారట. ఆ వీడియోను అనసూయ షేర్ చేసింది. అందులో ఆమె తన భర్తను బాగానే ఎంకరేజ్ చేస్తోంది. వీడియో తరువాత ముందు ఫీల్డింగ్ చేయమని అనసూయకు సుశాంక్ ఆదేశాలిచ్చాడు. మొత్తానికి సండేను అనసూయ ఫుల్ హ్యాపీగా గడిపినట్టు తెలుస్తోంది.