సినిమా ప్రమోషన్స్‌లో బిజీ.. అనసూయ అలా కానిచ్చేస్తోంది!

Anasuya In Thankyou Brother Promotions

అనసూయ ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. బుల్లితెర మీద పలు షోలు, వెండితెరపై సినిమా ఆఫర్లు, ఓటీటీలపై వెబ్ సిరీస్‌లతో అనసూయ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాంటి అనసూయ సినిమా ప్రమోషన్స్ కూడా చేయాలంటే మామూలు విషయం కాదు. పైగా ఈ మధ్య అనసూయ ఐటం సాంగ్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా ఎంతో బిజీగా ఉన్న అనసూయ తన సినిమా ప్రమోషన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

Anasuya In Thankyou Brother Promotions
Anasuya In Thankyou Brother Promotions

అయితే అనసూయ ఇప్పుడు థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో బిజీగా ఉంది. ఈ మధ్యే వదిలిన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. కరోనా నేపథ్యంలో తెరకెక్కించిన ఈసినిమాలో అనసూయ నిండు గర్భిణిగా నటిస్తోంది. సినిమా మొత్తం కూడా అనసూయ నెలలు నిండిన గర్భిణిగానే నటించేలా కనిపిస్తోంది. లిఫ్ట్‌కు రిపేర్ వచ్చి ఆగడం.. అందులో అనసూయ చిక్కుకుపోవడం, అందులో అనసూయకు ప్రసవం జరగడం వంటి ఆసక్తికరమైన అంశాలతో సినిమా రాబోతోంది.

అయితే టీజర్, ట్రైలర్‌తో మంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ మూవిని మరింతగా ప్రమోట్ చేయాలని అనసూయ ఫిక్స్ అయినట్టుంది. అందుకే వీకెండ్ సమయాన్ని సినిమా ప్రమోషన్ కోసం కేటాయించింది. ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్‌లొ లైవ్‌లోకి వచ్చింది. హీరోతో పాటు అనసూయ కూడా లైవ్‌లోకి వచ్చి సినిమా విశేషాలను తన అభిమానులతో పంచుకుంది. మొత్తానికి ఈ సినిమా మీద అనసూయ మంచి అంచనాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.