Anasuya: ఆచార్య సినిమాకి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన అనసూయ… ఎంతంటే?

Anasuya: బుల్లితెరపై తన హావ భావాలతో యాంకరింగ్ చేస్తూ, తక్కువ కాలంలోనే భారీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్‌ . రోజు రోజుకూ ఆమెకు పాపులారిటీ పెరుగుతుండడంతో ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లోనూ నటిస్తూ, అటు సిల్వర్ స్క్రీన్‌పైనా తన సత్తాను చూపిస్తోంది ఈ భామ. ఇటీవలి కాలంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోనూ నెగెటివ్ క్యారెక్టర్‌లో నటించి, పాన్ ఇండియా రేంజ్‌లో తన ఇమేజ్‌ను పెంచుకుంది అనసూయ, ఇక పుష్ప 2లో కూడా ఆమె కంటిన్యూ అవుతుందని సమాచారం.

ఇలా వరుస సినిమాలతో పుల్‌ స్వింగ్‌లో దూసుకుపోతున్న అనసూయ , అటు స్మా్‌ల్‌ స్ర్కీన్‌పై యాంకరింగ్‌తో అదరగొడుతూనే సిల్వర్‌ స్ర్కీన్‌పై సత్తాచాటుతోంది. అంతే కాకుండా ఇక మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి అనసూయ ఆచార్య, లూసీఫర్‌ రీమేక్ గాడ్‌ఫాదర్‌ సినిమాల్లోనూ ఈ ముద్దుగుమ్మ కీ రోల్స్‌ చేస్తోంది. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమాలో కథను మలుపుతిప్పే క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనున్నట్లు సమచారం. కాగా ఇందులో అనసూయ మేకోవర్‌ కూడా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుందని సినీ వర్గాల టాక్‌.

ఈ సినిమాలో తన పాత్ర అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అనసూయ కూడా ధీమాతో ఉందని తెలుస్తోంది. ఇక రోల్‌కు తగ్గట్టే ఈ సినిమా కోసం ఆమె భారీ పారితోషకం తీసుకుంటోదని సమాచారం. ఏకంగా రూ.25 లక్షల వరకు ఆమె పారితోషికాన్ని డిమాండ్ చేసిందని, దానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆచార్య సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఏప్రిల్‌ 29 వరకు ఆగాల్సిందే.