ఆ ముగ్గరిపై ముద్దుల వర్షం.. విడిచి ఉండకలేకపోతోన్న అనసూయ

Anasuya Bharadwaj Missing Her Family

అనసూయ గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉంటోందన్న సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తం చెన్నైలోనే గడిపింది. నివర్ తుపాను ప్రభావం తగ్గిన తరువాత అనసూయ అక్కడికి మకాం మార్చేసింది. విజయ్ సేతుపతి, మనో వంటి వారితో కలిసి రచ్చ చేస్తుంటే ఊరికే చెన్నైకి వెళ్లి ఉంటుందని అంతా భావించారు. అయితే కొంతమంది మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తంచేస్తూనే వచ్చారు. వారికి సమాధానం దొరికేసింది. అనసూయ తన కొత్త సినిమా లుక్ టెస్ట్ కోసమే చెన్నైకి వెళ్లింది.

Anasuya Bharadwaj Missing Her Family

ప్రస్తుతం దక్షిణాదిలో సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఆ పాత్రకు అనసూయ కరెక్ట్‌గా ఉంటుందా? లేదా? అని లుక్ టెస్ట్ చేశారు. తాజాగా అనసూయ ఓ ఫోటోను షేర్ చేయగా అది బాగానే వైరల్ అయింది. అయితే మామూలుగా అనసూయ తన ఫ్యామిలీని వదిలి ఎప్పుడూ కూడా ఇలా దూరంగా ఉండింది లేదు. ఎంత పని ఉన్నా కూడా వీకెండ్స్ మాత్రం కచ్చితంగా పిల్లలు, భర్తతోనే గడుపుతానని చెబుతూఉండేది.

కానీ ఈ సారి మాత్రం అది కుదరలేదు. ప్రాజెక్ట్ చర్చల్లో భాగంగానే ఇంకా అనసూయ చెన్నైలోనే ఉండాల్సి వస్తోందట. అందుకే ఫ్యామిలీని మిస్ అవుతున్నాని తెగ ఫీలైపోయింది. అందుకే తన ముగ్గురి పిల్లల (ఇద్దరు పిల్లలు, భర్త)తో వీడియో కాల్‌లో మాట్లాడి అనసూయ హ్యాపీగా ఫీలైంది. మిమ్మల్ని మిస్ అయ్యే బదులు మీకు కిస్సుల ఇస్తున్నా అంటూ క్యాప్షన్ పెట్టేసింది. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ వీడియో కాల్‌కు సంబంధించిన ఫోటో బాగానే వైరల్ అవుతోంది.